సంక్రాంతి సినిమాల్లో కామన్ ఒక సర్ప్రైజ్

సంక్రాంతి సినిమాల్లో కామన్ ఒక సర్ప్రైజ్

ఎప్పట్లాగే ఈ సంక్రాంతికి కూడా తెలుగు భారీ చిత్రాలు రిలీజయ్యాయి. అన్ని సినిమాలూ భారీ స్థాయివే. తెలుగు నుంచి మూడు సినిమాలొస్తే.. తమిళం నుంచి సూపర్ స్టార్ రజనీ సినిమా 'పేట' కూడా సంక్రాంతి బరిలో దిగింది. ఈసారి సంక్రాంతి రేసులో నిలిచిన మూడు తెలుగు సినిమాల్లోనూ ఒక కామన్ సర్ప్రైజ్ ఉండటం విశేషం. ఈ సినిమాల్లో హీరోల పాత్రలకు వాళ్ల నిజ జీవిత పేర్లే ఉండటం విశేషం.

'యన్.టి.ఆర్-కథానాయకుడు' సినిమా ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇక్కడ హీరోకు ఎన్టీఆర్ పేరుండటంలో ఆశ్చర్యం లేదు. ఆ పాత్రను పోషించింది బాలయ్యే అయినా చేసింది ఎన్టీఆర్ పాత్ర. కాబట్టి హీరో పాత్రకు ఒరిజినల్ పేరున్నట్లే.

ఇక మిగతా రెండు సినిమాల విషయానికి వస్తే.. 'వినయ విదేయ రామ'లో హీరో పాత్ర పేరు రామ్ కొణిదెల అన్న సంగతి టీజర్ చూసినప్పుడే తెలిసిపోయింది. తన సొంత పేరునే కాక ఇంటి పేరును కూడా పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఇక సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన సినిమా 'ఎఫ్-2'లో ఇద్దరు హీరోలంటే.. వాళ్లిద్దరికీ సొంత పేర్లే పెట్టేశారు.

విక్టరీ వెంకటేష్ ఇందులో తన షార్ట్ నేమ్ 'వెంకీ'గా కనిపించాడు. వరుణ్ తేజ్ పేరును వరుణ్ యాదవ్‌గా పెట్టారు. ఇలా ఒక సీజన్లో రిలీజైన మూడు సినిమాల్లోనూ హీరోల పాత్రలకు వాళ్ల సొంత పేర్లే ఉండటం అరుదైన విషయమే. ఇక డబ్బింగ్ సినిమా అయిన 'పేట' ఇందుకు మినహాయింపు. అందులో రజనీ కాంత్ పాత్రకు 'కాళి', 'పేట వీర' అనే పేర్లు పెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English