యుఎస్‌లో క్రష్ అయిపోయిందిగా..

యుఎస్‌లో క్రష్ అయిపోయిందిగా..

యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ లెక్కలు భిన్నంగా ఉంటాయి. అక్కడ స్టార్ ఇమేజ్ అన్నిసార్లూ అక్కరకు రాదు. కంటెంటే కీలకంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద మాస్ స్టార్లు అయిన వాళ్లు అక్కడ తక్కువ మార్కెట్‌తో సరిపెట్టుకుంటూ వచ్చారు. నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్ లాంటి హీరోలు ఈ కోవకే చెందుతారు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాలయ్య.. ‘ధృవ’, ‘రంగస్థలం’ సినిమాలతో చరణ్ అక్కడ బాగా రైజ్ అయ్యారు. ముఖ్యంగా చరణ్ రేంజే మారిపోయింది. ‘ధృవ’తో 2 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిన చరణ్.. ‘రంగస్థలం’తో ఏకంగా 3.5 మిలియన్ మార్కును అందుకున్నాడు. దీంతో అక్కడ అతడి మార్కెట్ పెద్ద స్థాయికి చేరినట్లే అనుకున్నారు. కానీ చరణ్ కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’తో కథ అడ్డం తిరిగింది.


తొలి రోజు నెగెటివ్ టాక్‌ను తట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. రూ.26 కోట్ల దాకా షేర్ రాబట్టింది. కానీ అమెరికాలో మాత్రం సినిమా తుస్సుమనిపించించింది. ఓవైపు ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’కి యుఎస్ ప్రిమియర్స్ ద్వారా 4.6 లక్షల డాలర్ల దాకా రాగా.. ‘వినయ విదేయ రామ’ 1.81 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. ఇక శుక్రవారం అయితే పరిస్థితి దారుణం. కేవలం 30 వేల డాలర్లే వచ్చాయి. మొత్తంగా శుక్రవారం నాటికి వసూళ్లు 2.1 లక్షల డాలర్లే అయ్యాయి. సినిమాకు వచ్చిన టాక్.. ఈ సినిమా జానర్ ప్రకారం చూస్తే అక్కడ ఈ చిత్రం శని, ఆదివారాల్లో కూడా పెద్దగా వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఫుల్ రన్లో హాఫ్ మిలియన్ డాలర్లు కూడా కష్టమే. కానీ ఈ చిత్రం సేఫ్ జోన్లోకి రావాలంటే మిలియన్ డాలర్లకు పైగా రాబట్టాలి. కానీ హాఫ్ మిలియనే కష్టమంటే ఇక మిలియన్ గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ. కాబట్టి బయ్యర్లు భారీ నష్టాలు పాలవక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English