భలే దొరికాడు అన్ని పాత్రలకీ..

భలే దొరికాడు అన్ని పాత్రలకీ..

నటుడికి తొందరగా క్రేజ్ రావాలంటే కాంట్రవర్సీ కామెంట్ అయినా చేయాలి లేదంటే బయోపిక్ లో అయినా నటించాలి. నిజ జీవితానికి సంబందించిన ఒక పాత్ర దొరికితే చాలు అందరి దృష్టిలో పడతారు. అయితే శ్రీ తేజ్ లాక్కేమిటో గాని బయోపిక్ లలో పొలిటిషయన్స్ క్యారెక్టర్స్ కి కరెక్ట్ గా సరిపోతున్నాడు. సాధారణంగా అలాంటి వారిని ఎన్నుకోవాలంటే మాక్సిమమ్ ఒక్కరే సెట్ అవుతారు.

కానీ శ్రీ తేజ్ మాత్రం అవకాశం వస్తే చాలు ఏ పాత్ర కైనా సిద్ధమంటూ రెడీ అవుతున్నాడు. ఇటీవల వర్మ లక్మిస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రకు సంబందించిన ఫోటో రివీల్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ తేజ్ చంద్రబాబు హావభావాలతో బలే కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అంతే కాకుండా గతంలో వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాలో కూడా దేవినేని నెహ్రు పాత్ర చేసి శబాష్ అనిపించుకున్నాడు. మొత్తానికి శ్రీ తేజ్ అన్ని పాత్రలకు బలే దొరికాడు అనిపిస్తోంది. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతిగా కన్నడ నటీమణి యజ్ఞా షెట్టి నటిస్తున్నట్లు వర్మ ఫొటో రిలీజ్ చేశాడు. సినిమాపై సైలెంట్ గా అంచనాలను రేపుతున్న వర్మ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English