బిగ్ బాస్ 3: కంటెస్టెంట్స్ లిస్ట్

బిగ్ బాస్ 3: కంటెస్టెంట్స్ లిస్ట్

రియాలిటీ షోల దెబ్బకు సీరియల్స్ మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి షో ఇప్పుడు టివి ఛానల్స్ కు మంచి రేటింగ్ ను అందిస్తుండడంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ కోసం స్టార్ మా సిద్ధమవుతోంది. అయితే హోస్టింగ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి - వెంకటేష్ లేదా మళ్ళీ తారక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే.. మెయిన్ గా బిగ్ బాస్ 3లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారగా అందుకు సంబందించిన ఓకే లిస్ట్ కూడా వైరల్ అవుతోంది.  రేణు దేశాయ్ - గద్దె సింధూర - శోభిత ధూళిపాళ - వరుణ్ సందేశ్ - రఘు మాస్టర్ - హేమచంద్ర - పొట్టి గణేష్ -టివి ఆర్టిస్ట్ జాకీ - చైతన్య కృష్ణ - కమల్ కామరాజ్ - నాగ పద్మిని - మహాతల్లి ఫెమ్ జాన్వీ.

 మొత్తంగా 13 మందిని ఇప్పటివరకు ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. అయితే ఇంకా ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జూన్ లో బిగ్ 3 మొదలు కానుంది. కాకపోతే లిస్టులో ఉన్న చాలామంది అసలు బిగ్ బాస్ అంటే ఇష్టం లేని బ్యాచ్. మరి చూద్దాం ఇందులో ఎన్ని నిజం అవుతాయో ఎన్ని అబద్దంగా తేలిపోతాయో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English