అదుర్స్ 2.. ఆందోళనలో అభిమానులు

అదుర్స్ 2.. ఆందోళనలో అభిమానులు

జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా 2010లో వచ్చిన అదుర్స్ మూవీ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వివి.వినాయక్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే గతంలో నందమూరి అభిమానులు ఆ సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుంది అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ విషయంలో భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే సినిమాకు కథను అందించిన కోన వెంకట్ ఇప్పుడు ఫామ్ లో లేడు. పైగా అప్పట్లో ఆ కథలో ప్రాసలు పంచ్ ల విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ హెల్ప్ చేశాడని టాక్. ఇక శ్రీను వైట్ల గ్యాంగ్ అంటేనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా ట్విట్టర్ గూట్లో ఫాలోవర్స్ ముచ్చట్లు పెట్టిన ఒకప్పటి శ్రీను వైట్ల ఆస్తాన రచయిత కోన అదుర్స్ 2 స్క్రిప్ట్ రెడీ అయ్యిందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

దీంతో ఆ కథ ఎలా ఉంటుందో అనే అనుమానం రాకుండా ఉండదు. అదే విధంగా సీక్వెల్ ను డైరెక్ట్ చేయాలంటే మళ్ళీ వినాయక్ వస్తాడా అనే డౌట్ కూడా ఉంది. ఆయన పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. కమర్షియల్ సినిమాలను చేసి అలసిపోయిన వినాయక్ కు నెక్స్ట్ ప్రాజెక్టు కోసం హీరోను వెతుక్కోవడమే కష్టంగా మారింది. మరి అదుర్స్ 2 ఎలా వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English