కథానాయకుడిగా కౌశల్

కథానాయకుడిగా కౌశల్

బిగ్ బాస్ 2లో ఏ సమయానికి అడుగు పెట్టాడో గని కౌశల్ మందా కష్టానికి అదృష్టం బానిసయిపోయిందనే చెప్పాలి. విమర్శలు ఎన్ని వస్తున్నా ఇబ్బందులు ఎన్ని ఎదురైనా టైమ్ అతనికి బాగా కలిసొస్తుంది. గత కొన్నేళ్లుగా యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సీరియల్స్ లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసిన కౌశల్ ఇప్పుడు తాను అనుకున్న గోల్ కి రీచ్ అవుతున్నాడు.

ఏకంగా కథానాయకుడి పాత్రలో నటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ నిర్మాత అందుకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ప్రముఖ నిర్మాత మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని టాక్ వస్తోంది. ఒక యువ దర్శకుడు రెడీ చేసిన కథకు కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే సినిమా కథ పవన్ రాజకీయాల నుంచి ఆధారంగా చేసుకొనిసెట్ చేసుకున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సేనాని అనే టైటిల్ ను కూడా సలెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది.

టాలీవుడ్ లోని స్టార్ నటీనటులు కూడా కౌశల్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English