రజనీనా.. అజితా.. ఎవరు విజేత?

రజనీనా.. అజితా.. ఎవరు విజేత?

సంక్రాంతికి తెలుగులో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ముందుగా వచ్చిన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ మంచి టాక్ తెచ్చుకుంది. తర్వాతి రోజు రిలీజైన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘పేట’కు ఇక్కడ డివైడ్ టాకే వచ్చింది. ఈ రోజు విడుదలైన ‘వినయ విధేయ రామ’ నెగెటివ్ టాక్‌తో మొదలైంది. ఇక చివరగా రాబోతున్న ‘ఎఫ్-2’ పరిస్థితేంటో చూడాలి. ప్రస్తుతానికైతే ‘యన్.టి.ఆర్’ కథానాయకుడు’దే పైచేయిగా కనిపిస్తోంది. సంక్రాంతికి తెలుగులో లాగే తమిళంలోనూ సందడి జోరుగా ఉంటుంది. ఈ సీజన్లో అక్కడ కూడా భారీ సినిమాలు రిలీజవుతుంటాయి. ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్ పొంగల్ రేసులో నిలిచారు. ‘పేట’ సినిమాతో పాటు ‘విశ్వాసం’ కూడా ఒకే రోజు రిలీజవడం విశేషం. మరి వీటిలో ఏది పైచేయి సాధిస్తోంది?

ఇటు ‘పేట’.. అటు ‘విశ్వాసం’ రెండూ కూడా మాస్ మసాలా సినిమాలే. రెండూ ఆ హీరోల అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని చేసినవే. రెంటికీ దాదాపుగా ఒకేలాంటి టాక్ వచ్చిందక్కడ. కాకపోతే రజనీ సినిమాలో కొంచెం క్లాస్ టచ్ కూడా ఉంది. ఆ సినిమా స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్‌గా పేరు తెచ్చుకుంది. అజిత్ సినిమా ఊర మాస్ సినిమా అన్న టాక్ వచ్చింది. రెండూ సినిమాల్లోనూ కొత్తదనం లేదు. రజనీ, అజిత్ అభిమాలకైతే ఈ సినిమాలు విందు భోజనంలా ఉన్నాయి. మాస్ ప్రేక్షకులకు ఓకే అనిపిస్తున్నాయి. కానీ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు మాత్రం ఈ రెండు సినిమాలపై పెదవి విరుస్తున్నారు. వసూళ్ల విషయంలో రెండూ గట్టిగానే పోటీ పడుతున్నాయి. రెండు చిత్రాలూ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతున్నాయి. పండగ రోజు వరకు జోరు కొనసాగేలా కనిపిస్తోంది. ఆ తర్వాత కానీ ఏ సినిమా పైచేయి సాధిస్తోందో చెప్పడం కష్టంగా ఉంది. ప్రస్తుతానికి రేటింగ్స్, టాక్ పరంగా రజనీ సినిమా ‘పేట’కు కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English