ఆ క్లబ్బులో చేరిపోయిన బోయపాటి

ఆ క్లబ్బులో చేరిపోయిన బోయపాటి

టాలీవుడ్లో మంచి సక్సెస్ రికార్డున్న స్టార్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకడు. ‘దమ్ము’ మినహాయిస్తే బోయపాటి కెరీర్లో ఫ్లాప్ లేదు. ‘తులసి’ పెద్ద హిట్టు కాకపోయినా యావరేజ్‌గా ఆడింది. మిగతా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘సరైనోడు’ కూడా హిట్టే అయింది. ‘దమ్ము’ ఫ్లాప్ అయింది కానీ.. మరీ బోయపాటిని అవమానలకేమీ గురి చేయలేదు. ఐతే ‘వినయ విధేయ రామ’ మాత్రం బోయపాటికి మామూలు డ్యామేజ్ చేసేలా లేదు. ఈ సినిమాతో బోయపాటి ఘోర అవమానాల్నే మూటగట్టుకుంటున్నాడు. ఈ సినిమా తొలి షో పడ్డప్పటి నుంచి సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ కావట్లేదు బోయపాటి.

చరణ్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి దూకేసి రైలు మీద బీహార్ వెళ్లిపోయే సీన్.. అతను విలన్ల తలలు తెగ నరికితే వాటిని గద్దలు ఎత్తుకుపోయే సన్నివేశం.. విలన్ని పాము కరిస్తే అతను కాకుండా పాము చచ్చిపోయే సీన్.. ఇలా ట్రోలింగ్‌కు కావాల్సిన స్టఫ్ చాలానే ఇచ్చాడు బోయపాటి. దీంతో సామాజిక మాధ్యమాల్లో బోయపాటిని మామూలుగా ఆడుకోవట్లేదు. ఒకప్పుడు ‘శక్తి’.. ‘షాడో’ లాంటి సినిమాలతో మెహర్ రమేష్ ఓ రేంజిలో ట్రోల్ అయ్యాడు. ‘బ్రహ్మోత్సవం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ‘ఇంటిలిజెంట్’ డైరెక్టర్ వి.వి.వినాయక్‌లకు కూడా అవమానాలు తప్పలేదు. ఈ దర్శకుల జాబితాలోకి బోయపాటి చేరాడు. ఇంకా ‘పలనాటి బ్రహ్మనాయుడు’.. ‘విజయేంద్ర వర్మ’ లాంటి బాలయ్య సినిమాల్లోని సన్నివేశాల మీదా ఇలాగే పెద్ద స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. కానీ అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడంతో ఆ దర్శకులు బతికిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English