వర్మ సినిమాలో చంద్రబాబు ఎవరంటే..

వర్మ సినిమాలో చంద్రబాబు ఎవరంటే..

సంక్రాంతికి రిలీజైన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమా గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వార్తల్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు వివాదాస్పద పాటలు రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఇప్పుడు తన సినిమాలో ప్రధాన పాత్రధారుల వివరాలు బయటపెట్టే పనిలో పడ్డాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో అత్యంత కీలకమైన పాత్రల్లో నారా చంద్రబాబు నాయుడి క్యారెక్టర్ ఒకటనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు వర్మ.. శ్రీతేజ్‌ను ఎంచుకున్నాడు.

ఈ శ్రేతేజ్ మరెవరో కాదు.. వర్మ వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూ పాత్ర పోషించిన నటుడే. అతను ఇటీవలే విడుదలైన ‘యన్.టి.ఆర్’ సినిమాలోనూ ఉన్నాడు. ఇందులో శ్రీతేజ్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించాడు. ఆ చిత్రంలో చంద్రబాబు పాత్రను రానా దగ్గుబాటి చేసిన సంగతి తెలసిిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చంద్రబాబుగా శ్రీతేజ్ కనిపిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆ మధ్య చంద్రబాబు పోలికలతో ఒక సర్వర్ కనిపించడంతో వర్మ అతడిని వెతికి పట్టుకున్న సంగతి తెలిసిందే. అతడితోనే బాబు పాత్ర చేయిస్తాడనుకున్నారు. కానీ శ్రీతేజ్‌ను చంద్రబాబుగా మార్చి ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి నటుడినైనా తన పాత్రలకు తగ్గట్లు మలచడంలో నేర్పరి అయిన వర్మ.. శ్రీతేజ్‌కు కూడా తనదైన శైలిలో మేకోవర్ ఇచ్చాడు. ఇక ‘కిల్లింగ్ వీరప్పన్’లో వీరప్పన్ భార్యగా నటించిన యగ్న శెట్టిని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీపార్వతిగా వర్మ చూపించబోతుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English