అబ్బా.. స్టేజ్ ఏం సెట్ అయిందో!

అబ్బా.. స్టేజ్ ఏం సెట్ అయిందో!

తెలుగులో ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యే ఏకైక సీజన్ సంక్రాంతే. నాలుగు సినిమాలు రిలీజైతే నాలుగూ బాగా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే ఈ సీజన్లో అంచనాలు తేడా వచ్చి కొన్ని సినిమాలు దారుణంగా దెబ్బ తినడం.. కొన్ని సినిమాలకు ఊహించని అడ్వాంటేజే వచ్చి సంచలన విజయాలు సాధించడం కూడా జరుగుతుంటుంది. గత ఏడాది పరిస్థితే తీసుకుంటే ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ కావడం ‘జై సింహా’ లాంటి యావరేజ్ సినిమాకు కలిసొచ్చింది. అంచనాల్ని మించి ఆ చిత్రం విజయం సాధించింది.

ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా అది అంతగా ఉపయోగించుకోవట్లేదు. రెండో రోజు నుంచి వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఇక తర్వాతి రోజు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘పేట’ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ రోజు రిలీజైన ‘వినయ విధేయ రామ’ పరిస్థితి ఘోరంగా ఉండేలా ఉంది. ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ టాకే వచ్చింది. దీంతో చివరగా రాబోయే ‘ఎఫ్-2’కు తిరుగులేని అడ్వాంటేజీ ఉండేలా కనిపిస్తోంది.

సంక్రాంతి సీజన్‌కు తగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లాగా కనిపిస్తుండటం ‘ఎఫ్-2’కి కలిసొచ్చే అంశం. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ పూర్తి వినోదాత్మకంగా ఉండి అంచనాల్ని పెంచాయి. ‘శతమానం భవతి’ తరహాలో దిల్ రాజు సంక్రాంతికి మరో పెద్ద హిట్టు కొడతాడన్న అభిప్రాయాలు కలిగాయి. ఇప్పుడు మిగతా సినిమాల పరిస్థితి అయోమయంగా మారిన సమయంలో ‘ఎఫ్-2’ వస్తోంది. దీనికి కనుక పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోవడం ఖాయం. దీనికి స్టేజ్ అయితే భలేగా సెట్టయింది. మరి శనివారం ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English