ఎన్టీఆర్‌ అతడిని చెడగొడుతున్నాడంట!

ఎన్టీఆర్‌ అతడిని చెడగొడుతున్నాడంట!

జూనియర్‌ ఎన్టీఆర్‌పై ఇటీవలి కాలంలో మీడియా ఎంతగా విరుచుకుపడిందో తెలిసిందే. అతడిని తక్కువ చేసి మాట్లాడుతూ గంటల కొద్దీ కార్యక్రమాలను ప్రసారం చేసింది. అయితే ఇదంతా చూస్తున్నా కానీ మౌనంగా భరించిన ఎన్టీఆర్‌ అందరికీ సమాధానం సినిమా ద్వారా ఇవ్వాలని చూస్తున్నాడట. 'రామయ్యా వస్తావయ్యా'లో తనని టార్గెట్‌ చేసిన వారిని టార్గెట్‌ చేసే డైలాగ్స్‌ చాలా ఉంటాయని, ఇవి అడిగి మరీ ఎన్టీఆర్‌ రాయించుకుంటున్నాడని భోగట్టా.


ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన హరీష్‌ శంకర్‌తో బలవంతంగా కాంట్రవర్షియల్‌ డైలాగ్స్‌ రాయించుకుంటున్నాడని, ఈ చిత్రం రిలీజ్‌ అయిన తర్వాత మీడియాలో దీనిపై రచ్చ బాగా జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ 'బుడ్డోడు' డైలాగ్‌ బాంబులా పేలింది. ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమేనంట. చాలా మందికి సూటిగా తగిలే పదునైన సంభాషణలు ఇందులో ఉంటాయని, ఎన్టీఆర్‌ అభిమానులకి అయితే పూనకాలు వచ్చేస్తాయని, అలాగే ఎన్టీఆర్‌ వ్యతిరేకులు విమర్శలతో విరుచుకు పడిపోతారని టాక్‌ వినిపిస్తోంది. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు