ఒక్క హిట్టు కావాలి బ్రదర్

ఒక్క హిట్టు కావాలి బ్రదర్

వరుసగా ఫెయిల్యూర్స్ సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో గోపిచంద్ ఒకరు. మాస్ ఆడియెన్స్ మద్దతు క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ ఈ హీరో ఎన్ని ప్రయోగాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయలేకపోతున్నాడు. మినిమమ్ హిట్ అందుకోవడమే ఇప్పుడు కష్టంగా మారింది. హిట్టు చూసి ఏళ్ళవుతుండడంతో ఒక్క హిట్టు అంటూ కష్టపడుతున్నాడు.

మరోసారి గౌతమ్ నంద దర్శకుడితో గోపిచంద్ వర్క్ చేయబోతున్నాడు. కమర్షియల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నందికి కూడా ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం.  అయితే ప్రయోగాలకు పోకుండా పక్కా హిట్టయ్యే విధంగా సినిమా చేయాలని గోపిచంద్ డైరెక్టర్ తో డిస్కస్ చేశాడట. సంపత్ కూడా అందుకు తగ్గట్టుగా మాస్ స్క్రిప్ట్ ను రెడీ చేయడంతో సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మాత రాధ మోహన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ మాస్ సినిమాతోనైనా గోపి గట్టిగా కొడతాడో లేదో చూడాలి.

ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి త్వరలోనే అఫీషియల్ గా ప్రాజెక్టును లాంచ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గోపిచంద్ కోలీవుడ్ దర్శకుడు తిరుతో ఒక సినిమా చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English