తమన్నాకు అస్సలు మొహమాటం లేదే

తమన్నాకు అస్సలు మొహమాటం లేదే

హ్యపీ డేస్ లో కనిపించిన తమన్నాకి ఇప్పుడు కనిపిస్తోన్న తమన్నాకు వ్యత్యాసం చాలా ఉంది. సింపుల్ గా హోమ్లీ లుక్ నుంచి ఘాటైన గ్లామర్ స్విమ్ సూట్స్ వరకు మిల్కిబ్యూటీ బాగానే అప్గ్రేడ్ అయ్యింది. ఓ వైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తునే స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తోంది. అంతే కాకుండా అవకాశాల కోసం హీరోలను నిర్మాతలను మొహమాటం లేకుండా అడిగేస్తోంది.

ప్రస్తుతం తమన్నా F2 ప్రమోషన్ లో బిజీగా ఉంది. రీసెంట్ గా జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తమన్నా చిత్ర యూనిట్ ని ఓ రేంజ్ లో పొగిడింది. వెంకటేష్ ని అయితే ఏకంగా స్వీటెస్ట్ డార్లింగ్ అనేసింది. ఇక వరుణ్ తేజ్ నుంచి చాలా నేర్చుకున్నట్లు చెబుతూ.. అతనితో మరో సారి వర్క్ చేయాలని ఉందని నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోమని ఇన్ డైరెక్ట్ గా ఆడిగేసింది.

ఇక నిర్మాత దిల్ రాజుపై కూడా తియ్యని మాటలతో తమన్నా మెల్ట్ చేసే ప్రయత్నం చేసింది. అందరిని చాలా మిస్ అవుతున్నా..మళ్లీ అందరం కలవాలి.. సో దిల్ రాజు గారు F3 ప్లాన్ చేయండి అని తమన్నా మాట్లాడింది. దీంతో మొత్తానికి తమన్నా మొహమాటం లేకుండా ఛాన్సులు అడిగేస్తోంది అని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమాతో అయినా మిల్కీ బ్యూటీ సక్సెస్ అందుకుంటుందో లేదో..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English