నో అన్నవాడిని బోయపాటి ఎలా ఒప్పించాడు?

నో అన్నవాడిని బోయపాటి ఎలా ఒప్పించాడు?

ఒకసారి హీరోగా నటించాక విలన్ రోల్స్.. సహాయ పాత్రలు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వయసు మీద పడి.. కెరీర్ మరీ డల్లయిపోయి.. ఏ మార్గం తోచనపుడు మాత్రమే ఇలాంటి పాత్రల దిశగా ఆలోచిస్తుంటారు. హిందీ నటుడు వివేక్ ఒబెరాయ్ మొదట్లో హీరో వేషాలే వేశాడు. కానీ ఒక దశలో కెరీర్ అయోమయ స్థితికి చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విలన్ అవతారం ఎత్తాడు. హృతిక్ రోషన్ సినిమా ‘క్రిష్’లో ప్రతినాయక పాత్ర పోషించాడు. అది అతడికి మంచి పేరు తెచ్చింది. కెరీర్‌ను మలుపు తిప్పింది. అక్కడి నుంచి హిందీలోనే కాక వేరే భాషల్లోనూ మంచి విలన్ పాత్ర దొరికినపుడల్లా చేసుకుపోతున్నాడు. తమిళంలో అతను ‘వివేగం’ చిత్రంలో విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతను ‘వినయ విధేయ రామ’ కోసం ప్రతినాయకుడిగా మారాడు.

ఐతే నిజానికి దర్శకుడు బోయపాటి శ్రీను ముందుగా అతడికి విలన్ పాత్ర ఆఫర్ చేస్తే చేయను అనేశాడట. తాను ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన ‘రక్త చరిత్ర’ తెలుగులో మంచి విజయం సాధించిందని.. ఇక్కడి ప్రేక్షకులు తనను హీరోగానే గుర్తుంచుకున్నారని.. అలాంటపుడు విలన్ పాత్ర చేయనని అన్నాడట. ఐతే బోయపాటి కథ.. పాత్ర విన్నాక నిర్ణయం చెప్పండని అన్నాడట. తర్వాత కథ, పాత్ర వివరించి మెప్పించాడట. అవి విన్నాక మరో ఆలోచన లేకుండా వివేక్ ఒబెరాయ్ ఈ సినిమా ఒప్పుకున్నాడట. మరి బోయపాటి అంతగా ఏం ఇంప్రెస్ చేసేశాడో చూడాలి. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రలంటే ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. బహుశా అతడి గత సినిమాలు చూడకపోవడం వల్ల వివేక్‌కు ఈ క్యారెక్టర్ కొత్తగా అనిపించిందేమో. ఇంతకీ ఆ పాత్రలో అంత విశేషం ఏం ఉందన్నది ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకులందరికీ తెలిసిపోతుంది లెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English