ఈ టాక్.. ఆ థియేటర్లు సరిపోవు బాస్

ఈ టాక్.. ఆ థియేటర్లు సరిపోవు బాస్

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘పేట’ తెలుగు వెర్షన్ విచిత్రమైన పరిస్థితుల్లో రిలీజైంది. ఎప్పుడూ రజనీ సినిమా వస్తోందంటే దానికి పోటీగా తెలుగు సినిమాలు రిలీజ్ చేయరు. భారీగా థియేటర్లు కేటాయిస్తారు. కానీ గత కొన్నేళ్లుగా రజనీ సినిమాలు వరుసగా నిరాశ పరుస్తుండటంతో ఆయనకు క్రేజ్ తగ్గింది. పైగా సంక్రాంతికి ఆల్రెడీ  బెర్తులు బుక్ అయిపోయాక లేటుగా ‘పేట’ రేసులోకి రావడంతో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రానికి మంచి టాక్ రావడం కీలకంగా మారింది. కానీ గురువారం రిలీజైన ‘పేట’కు డివైడ్ టాక్ వచ్చింది.

రజనీ స్టైల్, మేనరిజమ్స్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా ఓకే అనిపించొచ్చు కానీ.. దాన్ని మించి సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. తొలి రోజు వరకు ‘పేట’కు ఓ మోస్తరుగా థియేటర్లు దక్కాయి కానీ.. మరుసటి రోజు నుంచి పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్నాయి. ‘వినయ విధేయ రామ’.. ‘ఎఫ్’ సినిమాలతో థియేటర్లు నిండిపోతున్నాయి. ‘పేట’కు చాలా మంచి టాక్ వచ్చి ఉంటే.. తర్వాతైనా థియేటర్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే మున్ముందు కూడా థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కుతాయా అన్నది డౌటే. ‘వీవీఆర్’.. ‘ఎఫ్-2’ సినిమాలు దారుణంగా బోల్తా కొడితే తప్ప ‘పేట’ గట్టెక్కడం కష్టమే. ఈ పరిస్థితుల్లో నిర్మాత వల్లభనేని అశోక్ పెట్టుబడి వెనక్కి వస్తుందా అన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English