మళ్లీ రచ్చ గెలిచే పనిలో జేడీ..

మళ్లీ రచ్చ గెలిచే పనిలో జేడీ..

జేడీ చక్రవర్తి.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోయే పేరు కాదిది. 90ల్లో యువతను ఒక ఊపు ఊపిన హీరోల్లో అతనొకడు. ఐతే కొన్నేళ్లు హవా సాగించిన అతను.. ఆ తర్వాత నిలవలేకపోయాడు. హీరోగా వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడిపోయాడు. అదే సమయంలో తన గాడ్ ఫాదర్ రామ్ గోపాల్ వర్మను నమ్ముకుని బాలీవుడ్‌కు వెళ్లిపోయిన జేడీ.. అక్కడ నటుడిగానే కాక దర్శకుడిగానూ కొన్ని సినిమాలు చేశాడు. తర్వాత తిరిగి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు కానీ అంతగా సక్సెస్ కాలేదు. అతడి దర్శకత్వంలో వచ్చిన ‘హోమం’.. ‘సిద్ధం’ లాంటి సినిమాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో దర్శకత్వాన్ని కూడా పక్కన పెట్టేయాల్సి వచ్చింది. తెలుగులో నటుడిగా కూడా కెరీర్ కనిపించకపోవడంతో జేడీ.. మళ్లీ వేరే భాషల్నే నమ్ముకున్నాడు.

ఈ మధ్య జేడీ తమిళంలో తరచుగా సినిమాలు చేస్తుండటం విశేషం. తమిళంలో అతను ‘పట్టారై’ అనే వైవిధ్యమైన థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఉమెన్ ట్రాఫికింగ్ మీద తెరకెక్కిన ఈ చిత్రం అనేక అవార్డులు గెలుస్తుందని అంటున్నారు. ఇందులో జేడీ ఒక విభిన్నమైన పాత్ర చేశాడు. దీంతో పాటుగా ‘మరైందిరుందు పార్కుం మర్మం ఎన్న’ అనే ఇంకో తమిళ సినిమాలోనూ అతను నటిస్తున్నాడు. ఇంకో రెండు దక్షిణాది భాషల్లోనూ జేడీ సినిమాలు చేస్తుండటం విశేషం. మలయాళ స్టార్ హీరో.. ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ కథానాయకుడిగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘మైకేల్’లో జేడీ ఒక స్పెషల్ రోల్ చేశాడు. మరోవైపు కన్నడలో జేడీ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతుండటం విశేషం. కానీ తెలుగులో మాత్రం జేడీకి ఛాన్సుల్లేవు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ‘ఉగ్రం’ అనే సినిమా ఏదో చేశాడు కానీ.. దాన్ని పట్టించుకునే నాథుడే లేడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English