మమ మాస్‌ తర్వాత సూపర్ క్లాస్

మమ మాస్‌ తర్వాత సూపర్ క్లాస్

రణ్వీర్ సింగ్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద బాలీవుడ్. 2018లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ లాంటి సూపర్ స్టార్లు తీవ్ర నిరాశకు గురి చేస్తే.. రణ్వీర్ మాత్రం భారీ విజయాలతో బాక్సాఫీస్ హీరోగా నిలిచాడు. ఖాన్‌లు ముగ్గురు నటించిన మూడు సినిమాలూ డిజాస్టర్లే కాగా.. రణ్వీర్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్లయ్యాయి. రణ్వీర్ విలన్ రోల్‌లో కనిపించిన ‘పద్మావత్’ గత ఏడాది ఆరంభంలో విడుదలై మంచి విజయం సాధించింది. అతడికి నటుడిగా గొప్ప పేరు తెచ్చింది.

ఇక ఏడాది చివర్లో అతడి నుంచి వచ్చిన ‘సింబా’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే రూ.250 కోట్ల మార్కును దాటేసింది. రూ.300 కోట్ల మార్కు వైపు పరుగులు తీస్తోంది. ‘పద్మావత్’లో కనిపించిన రణ్వీర్‌తో పోలిస్తే.. ‘సింబా’లోని రణ్వీర్ పూర్తి భిన్నం. ‘సింబా’లో ఊర మాస్ పాత్రలో మెప్పించాడు రణ్వీర్.

ఈ యంగ్ హీరో ఎంతటి విలక్షణ నటుడో చెప్పడానికి తాజా రుజువు ‘గల్లీ బాయ్’. రణ్వీర్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రమిది. ‘సింబా’తో దీనికసలు పోలికే లేదు. ఇందులో పేద కుటంబానికి చెందిన సాధారణ కుర్రాడిగా కనిపించనున్నాడతను. అతడికి సంగీతం అంటే పిచ్చి. తన పాటలతో స్టేజ్‌లను షేక్ చేయాలని ఆశ పడుతుంటాడు. కానీ అతడికి సరైన ప్రోత్సాహం ఉండదు. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. ఇంటా బయటా అవమానాలు ఎదుర్కొంటూ నిత్యం సంఘర్షణ అనుభవించే కుర్రాడు.. చివరికి తన అభిరుచిని వదులుకోకుండా జీవితంలో ఎలా విజయం సాధించాడనే కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

తాజాగా విడుదలైన ‘గల్లీ బాయ్’ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. యువతను బాగా ఇన్‌స్పైర్ చేసే ఎమోషనల్ సినిమాలా ఉందిది. మమ మాస్ అవతారంలో కనిపించిన రణ్వీర.. ఇలాంటి సూపర్ క్లాస్ క్యారెక్టర్లోకి ట్రాన్స్‌ఫాం అయిన తీరుకు ఎవ్వరైనా ముగ్ధులైపోవాల్సిందే. ఫర్హాన్ అక్తర్ సోదరి జోయా అక్తర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. వేలంటైన్స్ డే కానుకగా దీన్ని రిలీజ్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English