‘శాతకర్ణి’ని దాటిన ‘కథానాయకుడు’

‘శాతకర్ణి’ని దాటిన ‘కథానాయకుడు’

నందమూరి బాలకృష్ణ కెరీర్‌కు మంచి ఊపే తెచ్చేట్లు కనిపిస్తోంది ‘యన్.టి.ఆర్’ సినిమా. బాలయ్య కెరీర్లో దేనికీ లేనంత బిజినెస్ ఈ చిత్రానికి జరిగింది. రెండేళ్ల కిందట ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి రూ.60 కోట్ల బిజినెస్ జరగడమే గొప్పగా చెప్పుకున్నారు. అలాంటిది ‘యన్.టి.ఆర్’ తొలి భాగం బిజినెస్సే రూ.100 కోట్లకు చేరువ కావడం విశేషమే. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడమూ భారీగానే చేశారు. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ థియేటర్లలో.. అత్యధిక ప్రాంతాల్లో ‘యన్.టి.ఆర్’ను రిలీజ్ చేశారు.

ఓవర్సీస్‌లో మామూలుగా బాలయ్య వీక్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మినహాయిస్తే ఏ బాలయ్య సినిమా కూడా యుఎస్‌లో  సత్తా చాటలేదు. కనీస స్థాయిలో కూడా వసూళ్లు రాని పరిస్థితి. ఐతే ‘యన్.టి.ఆర్’కు అక్కడ మాంచి క్రేజ్ వచ్చింది. ప్రిమియర్లు భారీ స్థాయిలో పడ్డాయి. 200కు పైగా లొకేషన్లలో ప్రిమియర్లు వేశారు. వసూళ్లు కూడా భారీగానే ఉండేలా కనిపిస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు అందిన సమచారం ప్రకారం ‘యన్.టి.ఆర్’ ప్రిమియర్ కలెక్షన్లు 4.5 లక్షల డాలర్ల మార్కును టచ్ చేశాయి.

బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రిమియర్ వసూళ్లు సాధించిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఆ చిత్రం 3.5 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఇంకా సెకండ్ షోలు పడకముందే ఆ వసూళ్లను దాటేసి హాఫ్ మిలియన్ మార్కు వైపు అడుగులేస్తోంది ‘యన్.టి.ఆర్’. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్లో ఈ చిత్రం బాగా పెర్ఫామ్ చేసేలా ఉంది. ఫుల్ రన్లో ‘శాతకర్ణి’ వసూళ్లను కూడా దాటే అవకాశముంది. ఆ చిత్రం 1.8 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English