సుకుమార్ సినిమాపై ఇక ఆపండబ్బా

సుకుమార్ సినిమాపై ఇక ఆపండబ్బా

ఆలూ లేదు చూలూ లేదు అన్న సామెత లాగే ఉంది సుకుమార్-మహేష్ బాబు సినిమా వ్యవహారం. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్ని రూమర్లు వచ్చాయో లెక్కే లేదు. అసలు ఈ సినిమా కథంటూ మొదలు పెట్టకముందే బ్యాక్ డ్రాప్ గురించి.. మహేష్ బాబు పాత్ర గురించి రూమర్లు మొదలైపోయాయి. ఈ చిత్రంలో నటీనటుల గురించి కూడా వార్తలొచ్చేశాయి.

ఒక దశ దాటాక ఇలాంటి వార్తలకు కొంచెం బ్రేక్ పడింది కానీ.. మళ్లీ ఈ మధ్య అవే తరహా రూమర్లు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్ అని.. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ ఇందులోనూ కీలకమైన పాత్ర చేయబోతోందని పుకార్లు మొదలయ్యాయి.

కానీ సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న సమచారం ప్రకారం.. మహేష్‌తో ఆయన చేయబోయే సినిమాకు సంబంధించి ఏదీ ఖరారవ్వలేదు. మహేష్ బాబుకు ఇంకా పూర్తి స్క్రిప్టు కూడా చెప్పలేదు సుక్కు. గత నెలలో మహేష్ బాబును కలిసిన సుక్కు హీరోతో పాటు కొన్ని పాత్రలు.. మూల కథ మాత్రమే చెప్పాడు. ఇంకా పూర్తి స్క్రిప్టు రెడీ కాలేదు. చివరి దశలో ఉంది. జనవరి నెలాఖర్లోపు పూర్తి స్క్రిప్టును మహేష్ బాబుకు చెప్పనున్నాడట సుక్కు.

ఇంకా ఏ పాత్రకు ఎవరనే విషయం ఖరారవ్వలేదు. ముందు పూర్తి స్క్రిప్టుకు మహేష్ బాబుతో ఆమోద ముద్ర వేయించుకున్నాక నటీనటులు.. టెక్నీషియన్లు.. లొకేషన్లు.. ఇతర వ్యవహారాల గురించి ఆలోచించబోతున్నాడు సుక్కు. ఎప్పట్లాగే రత్నవేలు కెమెరామన్ అనేది ఫిక్స్. తాను చేయబోయే కథ బ్యాక్ డ్రాప్ చెప్పి ఎలాంటి లొకేషన్లలో తీస్తే బాగుంటుందో చర్చించాడట సుక్కు. దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English