డే-1 హీరో బాలయ్యా.. చరణా?

డే-1 హీరో బాలయ్యా.. చరణా?

సంక్రాంతి సినిమాల సందడి మొదలైపోయింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ బుధవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో పాటు ఇంకో మూడు సినిమాలు వరుసగా మూడు రోజుల్లో థియేటర్లలోకి దిగుతున్నాయి. ఐతే సంక్రాంతికి ప్రతిసారీ భారీ సినిమాలే రిలీజవుతాయి కాబట్టి ఈ సమయంలో రికార్డుల గురించి కూడా చర్చ జరుగుతుంది.

ఈసారి రిలీజైన నాలుగు సినిమాల్లో ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’.. ‘వినయ విధేయ రామ’ చిత్రాల రేంజ్ వేరు. ఈ రెంటి పైనా భారీ అంచనాలున్నాయి. వీటికి రికార్డుల్ని బద్దలు కొట్టే స్థాయి ఉంది. మామూలుగా చూస్తే చరణ్‌తో పోలిస్తే బాలయ్య మార్కెట్ తక్కువే. తొలి రోజు.. తొలి వారాంతం.. ఓవరాల్ కలెక్షన్ల విషయంలో బాలయ్యకు రికార్డులు బద్దలు కొట్టేంత రేంజ్ లేదు.

కానీ ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ రేంజ్ మాత్రం వేరుగా ఉంది. ఈ సినిమాకు కొన్ని కారణాల వల్ల అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. బాలయ్య సినిమాల్లో వేటికీ జరగనంత బిజినెస్ దీనికి జరిగింది. రిలీజ్ కూడా భారీగానే ఉంది. ఓవరాల్ కలెక్షన్ల సంగతేమో కానీ.. తొలి రోజు వసూళ్ల విషయంలో ‘యన్.టి.ఆర్’ చిత్రమే సంక్రాంతికి రికార్డు నెలకొల్పవచ్చన్న అంచనాలున్నాయి.

ముందు వారాల్లో వచ్చిన సినిమాలన్నీ థియేటర్లు ఖాళీ చేసిన సమయంలో సంక్రాంతికి మిగతా చిత్రాల కంటే ముందు రావడం ‘యన్.టి.ఆర్’కు కలిసొస్తున్న అంశం. తొలి రోజు ఈ చిత్రానికి భారీగా థియేటర్లిచ్చారు. చాలా సిటీల్లో మెజారిటీ థియేటర్లలో ‘యన్.టి.ఆర్’నే వేస్తున్నారు. దీని వల్ల తొలి రోజు షేర్.. గ్రాస్ భారీగా ఉండే అవకాశాలున్నాయి. కాకపోతే మరీ ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం వల్ల అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడట్లేదు.

'వినయ విదేయ రామ’ విషయానికి వస్తే.. ఆల్రెడీ ‘యన్.టి.ఆర్’.. ‘పేట’ సినిమాలు థియేటర్లలో ఉండటం వల్ల దీనికి తొలి రోజు మరీ ఎక్కువ స్క్రీన్లు లభించవు. ‘యన్.టి.ఆర్’తో పోలిస్తే థియేటర్లు తగ్గుతాయి. మరోవైపు ఇది బోయపాటి మార్కు మాస్ సినిమా కావడంతో ఓవర్సీస్‌లో ఆశించిన ఓపెనింగ్స్ వచ్చేలా లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రిలీజయ్యే ప్రతి చోటా దీనికి తొలి రోజు హౌస్ ఫుల్స్ పడటం పక్కా. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో ఉన్నాయి దీనికి. మొత్తానికి రెండు సినిమాలకూ అడ్వాంటేజీ ఉంది. అలాగే డిజడ్వాంటేజీలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో తొలి రోజు హైయెస్ట్ గ్రాసర్ అయ్యేది బాలయ్య చిత్రమా.. చరణ్ సినిమా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English