నూతన్ నాయుడు 'నో' అంటున్నాడు

నూతన్ నాయుడు 'నో' అంటున్నాడు

బిగ్ బాస్ 2 తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నూతన నాయుడు యాక్టింగ్ సైడ్ అడుగులు వేస్తారని ఎవరు ఊహించలేదు. పైగా 14 సినిమాలతో బిజీగా మరిపోయడంటే నిజంగా ఒక ఆశ్చర్యమే అని చెప్పాలి.  మొదట్లో రాజకీయాల వైపు అడుగులు వేసిన ఈ క్యాష్ పార్టీ పర్సన్ ఈ విధంగా ఎలా అవకాశాలు అందుకుంటున్నారు అనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మనోడికి ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో బిగ్ బాస్ ద్వారా బాగానే క్లిక్ అయ్యాడు కాబట్టి దర్శకులు కూడా వారికి తోచిన అవకాశాలు ఇస్తున్నారు అనుకోవచ్చు. సంక్రాంతికి రిలీజ్ కాబోయే F2 తో పాటు సైరా - RRR లలో కూడా నూతన నాయుడు కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఇన్నేసి సినిమాలు అందులోను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న ఈ లక్కీ యాక్టర్ గా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతుంది అనుకోవడంలో తప్పు లేదు.

కానీ ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పటివరకు నూతన నాయుడు రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా.. నిజమట.

ఇప్పటివరకు ఏ నిర్మాత - దర్శకుడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నూతన్ నాయుడు స్పష్టం చేశాడు. పైగా ట్రావెలింగ్ - అసిస్టెంట్స్ - బోర్డింగ్ చార్జెస్ ఇలా.. అన్ని ఖర్చులు సొంతంగా తనకు తానే భరిస్తున్నట్లు నూతన నాయుడు చెప్పడం గమనార్హం. అవకాశాలు ఇచ్చే నిర్మాతలకు తన వల్ల ఆర్థిక భారం పడకూడదని నూతన్ నాయుడు చెబుతున్నాడు. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో మంచి అవకాశాలు వస్తే.. రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తాను అని తెలపడం విశేషం.

మరి నటన పరంగా నూతన్ నాయుడు ఎంతవరకు క్లిక్ అవుతాడో చూడాలి..  ఇతను చేస్తున్న పెద్ద సినిమాల్లో ఆ నిర్మాతలకు మనోడికి ఇచ్చే పేమెంట్ పెద్ద లెక్కే కాదు. కాని వాళ్ల దగ్గర కూడా ఎందుకు బ్రదర్ 'నో పేమెంట్' అంటూ ఈ కామెడీలు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English