శ్రీదేవి ఎలా చనిపోయిందో చూపించబోతున్నారు

శ్రీదేవి ఎలా చనిపోయిందో చూపించబోతున్నారు

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం పాలై అప్పుడే పది నెలలు దాటిపోయింది. ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి మొదట్లో కొన్ని రోజులు రకరకాల ఊహాగానాలు వచ్చాయి. మీడియా రకరకాల కథనాలు వెలువరించింది. కానీ రోజులు గడిచేకొద్దీ వ్యవహారం చల్లబడిపోయింది. అందరూ ఆమె గురించి మరిచిపోయారు. తన భార్య మరణం గురించి బోనీ కపూర్ ఒక వెర్షన్ చెప్పి ఆ వ్యవహారానికి తెర దించారు. ఐతే శ్రీదేవి చనిపోయినపుడు అసలేం జరిగిందన్నది దృశ్యరూపంలో చూసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. శ్రీదేవి బయోపిక్ కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. బోనీ కపూరే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం తన టీంతో కలిసి స్క్రిప్టు తయారు చేయిస్తున్నాడట బోనీ.
 
ఈ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తాడని కూడా బాలీవుడ్లో ప్రచారం జరుగుతుండటం విశేషం. కానీ మంచి అభిరుచి ఉన్న దర్శకుడికే బాధ్యతలు అప్పగిస్తేనే శ్రీదేవి జీవితం అందంగా తెరపైకి వస్తుందని బాలీవుడ్ జనాలు అంటున్నారు. శ్రీదేవి జీవితాన్ని సమగ్రంగా ఇందులో చూపిస్తారట. ఆమె ఏ స్థితిలో మరణించిందో.. ఆ రోజు ఏం జరిగిందో క్షుణ్ణంగా ఇందులో చూపించి జనాల సందేహాలకు తెర దించాలని బోనీ భావిస్తున్నాడట. మరోవైపు శ్రీదేవి జీవితాన్ని పుస్తక రూపంలో తేవడానికి కూడా బోనీ ఏర్పాట్లు చేస్తున్నారట. కొందరు రచయితలు కలిసి ఆమె జీవితానికి అక్షర రూపం ఇస్తున్నట్లు సమాచారం. శ్రీదేవి బయోపిక్‌ను ఈ ఏడాదే మొదలుపెట్టి.. సంవత్సరం చివరిలోపు ప్రేక్షకుల ముందుకు తేవాలనే ప్రయత్నంలో ఉన్నాడట బోనీ కపూర్. ఆమె గత ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English