మెగా ఫ్యామిలీతో బాలయ్యది భలే గొడవబ్బా..

 మెగా ఫ్యామిలీతో బాలయ్యది భలే గొడవబ్బా..

మెగా వెర్సస్ నందమూరి బాక్సాఫీస్ పోరు ఎప్పుడూ రసవత్తరమే. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల సినిమాలు ఒకేసారి రిలీజైతే ఆ మజానే వేరుగా ఉండేది. ఐతే మధ్యలో చిరు సినిమాలకు విరామం ఇవ్వడంతో వీరి పోరుకు బ్రేక్ పడింది. ఐతే చిరంజీవి రీఎంట్రీలో నేరుగా బాలయ్యతోనే తలపడటం విశేషం.

రెండేళ్ల కిందట సంక్రాంతి సీజన్లో చిరు రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’.. బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలూ దేని స్థాయిలో అది బాగానే ఆడింది. చిరు రీఎంట్రీలో నేరుగా రూ.100 కోట్ల మార్కును దాటాడు. నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పాడు. మరోవైపు ‘శాతకర్ణి’ బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

2017లో చిరుతో తలపడ్డ బాలయ్య.. తర్వాతి చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను ఢీకొట్టడం విశేషం. పోయినేడాది పవన్ సినిమా ‘అజ్ఞాతవాసి’తో బాలయ్య సినిమా ‘జై సింహా’ పోటీ పడింది. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ కావడంతో బాలయ్య చిత్రానికి కలిసొచ్చింది. ‘జై సింహా’కు కూడా డివైడ్ టాకే వచ్చినా.. పవన్ సినిమా తుడిచిపెట్టుకుపోవడంతో ఇది బాగానే ఆడింది.

బయ్యర్లకు లాభాలు తెచ్చింది. ముందు చిరుతో.. తర్వాత ఆయన తమ్ముడితో తలపడ్డ బాలయ్య ఇప్పుడు చిరు తనయుడిని ఢీకొడుతున్నాడు. బాలయ్య తన తండ్రి పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్.టి.ఆర్’ బుధవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇంకో రెండు రోజుల్లో చరణ్ చిత్రం ‘వినయ విధేయ రామ’ రిలీజవుతోంది. మరి చిరుతో సమవుజ్జీగా నిలిచి.. పవన్‌పై పైచేయి సాధించిన బాలయ్య.. చరణ్‌తో పోటీలో ఏ స్థాయిలో నిలుస్తాడన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English