శ్రీదేవి సెట్టవ్వలేదు గాని.. జయ ఓకే

శ్రీదేవి సెట్టవ్వలేదు గాని.. జయ ఓకే

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించి నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. ఎన్టీఆర్ బయోపిక్ కావడం ప్రధానాంశం అయితే అందుకు ప్రమోషన్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. సినిమాల్లో ప్రస్తుతం అందరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి నెలకొంది.

ఇక రీసెంట్ గా సినిమాకు సంబంధించిన మరో పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హన్సిక అండ్ బాలకృష్ణ వింటేజ్ విజువల్స్ లో కరెక్ట్ గా సరిపోయారు.  యమగోల సినిమాలో చిలక కొట్టుడు కొడితే చిన్నదాన అనే సాంగ్ తో జయప్రద-ఎన్టీఆర్ 1970లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాంటి పాట కథానాయకుడు లేకపోతే ఎలా అని దర్శకుడు క్రిష్ యాడ్ చేశాడు.

జయప్రదగా హన్సిక సరిగ్గా సరిపోయింది. అయితే ఆకు చాటు పిందె తడిచే అనే పాటకు శ్రీదేవి గెటప్ లో స్టెప్పేసిన రకూల్ ప్రీత్ మాత్రం అంతగా సెట్ అవ్వలేదనే టాక్ వచ్చింది. హన్సికకు మాత్రం జయప్రద క్యారెక్టర్ కరెక్టుగా సెట్టయ్యింది. అందుకు దర్శకుడు క్రిష్ క్యాస్టింగ్  విషయంలో ఎంతగా కష్టపడ్డాడో తెలుస్తోంది. ఇక  రకుల్ సెలెక్షన్ కొంత నెగిటివ్ గా ఉన్నా సినిమాలో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English