సగం రెమ్యునరేషన్ వదిలేసిన సాయిపల్లవి

సగం రెమ్యునరేషన్ వదిలేసిన సాయిపల్లవి

ఫిదా సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా హిట్టు కోసం పరితపిస్తున్న వరుణ్ కి అలాగే - శేఖర్ కమ్మలకు అదృష్ట లక్ష్మీగా మారి వాళ్ళ కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది. అయితే సినిమా విజయంలో కీలకపాత్ర పోషించే సాయి పల్లవి అపజయాన్ని కూడా బాధ్యతగా తీసుకుంటూ నిర్మాతకు తనవంతు సపోర్ట్ ని ఇచ్చింది. ఇటీవల సాయి పల్లవి శర్వానంద్ లు నటించిన పడి పడి లేచే మనసు రిలీజైన సంగతి తెలిసిందే.

దర్శకుడిని నమ్మి నిర్మాత సుధాకర్ సినిమాకు లెక్కకు మించిన డబ్బే ఖర్చు చేశాడు. అయితే అయితే సినిమా  ఉహించని డిజాస్టర్ గా నిలిచింది. పెట్టుబడితో సగం కూడా సరిగ్గా వెనక్కి రాకపోవడంతో నిర్మాత బాకీలు అతి కష్టం మీద కడుతున్నాడు. సాయి పల్లవి రెమ్యునరేషన్ లో ఇంకా 40 లక్షలు ఇవ్వాల్సి ఉంది. సినిమా విడుదల తరువాత ఇస్తాను అని చెప్పిన సుధాకర్ ఇటీవల ఆమెకు కబురుపెట్టగా ఆ డబ్బు వద్దని చెప్పిందట.

సినిమాలో సగం రెమ్యునేషన్ తీసుకోకుండా సాయి పల్లవి అలా చెప్పడంతో నిర్మాత షాక్ అయ్యాడట. వెంటనే సాయి పల్లవి పేరెంట్స్ కి విషయం చెప్పగా వారు కూడా కూతురు తీసుకున్న మంచి నిర్ణయానికి ఎంతో గర్వపడి తన మాటకు విలువ ఇచ్చారట. మొత్తానికి సాయి పల్లవిపై గతంలో వచ్చిన రూమర్స్ కు ఈ నిర్ణయం ఒక చెప్పు దెబ్బలాంటిదని చెప్పవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English