సెప్టెంబర్ లోనే సైరా వచ్చేది

సెప్టెంబర్ లోనే సైరా వచ్చేది

ఆరు పదుల వయస్సులో కూడా మెగాస్టార్ డెడికేషన్ మాములుగా లేదు. సైరా కోసం ఆయన కష్టపడుతున్న విధానం అంతా ఇంతా కాదు. అలుపు లేకుండా సమయాన్ని లెక్క చేయకుండా మేకప్ తో రెడీ అవుతున్నారట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. మెగా తనయుడు రామ్ చరణే. తండ్రిని చూసి కొన్ని సార్లు తమకే సిగ్గేసిందని అలాగే గర్వంగా కూడా ఉందని వివరించాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. సైరా ఎప్పుడొస్తుందో అని ప్రేక్షకుల్లో ఒక కన్ఫ్యూజన్ స్ట్రాంగ్ గా డిస్టర్బ్ చేస్తోంది. వారానికో రూమర్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటి లేకుండా హాల్ చల్ చేస్తుండడంతో రామ్ చరణ్ తన వివరణ ఇచ్చాడు. అసలైతే అనుకున్న ప్లాన్ ప్రకారం సమ్మర్ ఎండింగ్ మే లో సినిమా రావాలి. లేదా జూన్ లో అయినా రావాలని చరణ్ చెప్పాడు. అయితే సినిమా అనుకున్న విధంగా రావాలని ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని టీమ్ అందరం కష్టపడుతున్నట్లు చెబుతూ సినిమాను ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ చేస్తామని చరణ్ స్పష్టం చేశాడు.

ఇక ప్రస్తుత షెడ్యూల్స్ ప్రకారం  సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా చరణ్ ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు. సినిమా బాగా రావాలని మెగాస్టార్ చిరు చాలా కష్టబడుతున్నారని చెబుతూ..5 గంటలకు నిద్రలేచి 7 గంటల లోపే మేకప్ వేసుకొని రెడీ అయిపోతున్నారు. ఆయన కోసం వెయిట్ చేయాల్సింది మేము.. అలాంటిది మా కోసం ఆయన వెయిట్ చేస్తుంటే సిగ్గేసిందని చరణ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English