క్రిష్‌ పేరున్నా పట్టించుకోవట్లేదు

క్రిష్‌ పేరున్నా పట్టించుకోవట్లేదు

బాహుబలి తర్వాత ఆ తరహా చిత్రాలకి వుండే ఆదరణ చూసి మొదలు పెట్టిన సినిమాల్లో మణికర్ణిక ఒకటి. ఝాన్సీ లక్ష్మిభాయ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా కంగన రనౌత్‌ నటించింది. ముందుగా మన దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని సగం నుంచి కంగన టేకప్‌ చేసింది. అయితే దర్శకులుగా ఇద్దరి పేర్లూ వేస్తోంది. ఈ చిత్రాన్ని మొదట్లో హిందీలో మాత్రమే రిలీజ్‌ చేద్దామని అనుకున్నారు కానీ తర్వాత ప్లాన్‌ మారింది.

తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోను విడుదలవుతోంది. అయితే మిగతా భాషల మాట ఎలా వున్నా క్రిష్‌ పేరు వుంది కనుక తెలుగు ట్రెయిలర్‌కి స్పందన బాగుంటుందని అనుకుంటే, చాలా సాధారణ రెస్పాన్స్‌ మాత్రమే వస్తోంది. బహుశా హిందీ ట్రెయిలర్‌ని ఆల్రెడీ చూసేసి వుండడం వల్ల దీనిపై ఆసక్తి చూపించడం లేదేమో. ఈ చిత్రాన్ని తెలుగునాట ప్రమోట్‌ చేయడానికి కూడా క్రిష్‌ ఆసక్తి చూపించడం లేదు. బహుశా కంగనతో తలెత్తిన విబేధాలే క్రిష్‌ని దీనికి దూరంగా వుంచుతున్నాయేమో. క్రిష్‌ తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాలకీ సరిగ్గా నడుమన మణికర్ణిక రిలీజ్‌ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English