బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ చేతిలో పూజా హెగ్డె

బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ చేతిలో పూజా హెగ్డె

డిజె, అరవింద సమేత చిత్రాలతో భారీ చిత్రాల హీరోయిన్‌గా మారిపోయిన పూజా హెగ్డె త్వరలో మహేష్‌ సరసన మహర్షిలో కనిపించనుంది. పూజ హెగ్డెకి తెలుగు చిత్ర సీమలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్‌ వుంది. సరాసరి హృతిక్‌ రోషన్‌ సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పూజకి 'మొహంజుదారొ'తో సక్సెస్‌ రాకపోయినా కానీ ఆమె సెక్సీ లుక్స్‌కి బీ టౌన్‌ మేకర్స్‌ ఫిదా అయ్యారు. తెలుగునాట కూడా తన లుక్స్‌తోనే ఆఫర్స్‌ రాబట్టుకుంటోన్న పూజ ప్రస్తుతం హిందీలో హౌస్‌ఫుల్‌ 4 చిత్రంలో నటిస్తోంది.

ఈ ఫ్రాంఛైజీకి వున్న క్రేజ్‌ని బట్టి ఇది ఆమెకి బాలీవుడ్‌లో తొలి హిట్‌ ఇచ్చే చిత్రమనిపిస్తోంది. ఇప్పుడు ఆమె చేతికి ఇంకా డిపెండబుల్‌ ఆఫర్‌ వచ్చింది. బ్లాక్‌బస్టర్‌ సినిమాలకి పెట్టింది పేరయిన రోహిత్‌ షెట్టి రీసెంట్‌గా సింబాతో ఇంకో హిట్‌ కొట్టాడు. అతను తీసే తదుపరి చిత్రంలో పూజ హెగ్డె హీరోయిన్‌గా ఎంపికయిందట. ఇందులో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తాడట. ఏ యంగ్‌ హీరోయిన్‌ అయినా ఇప్పుడు రోహిత్‌ షెట్టి సినిమాలో ఛాన్స్‌ కోరుకుంటుంది. అలాంటిది పూజకి ఈ ఛాన్స్‌ వరించి వచ్చింది. ఇది కూడా రోహిత్‌ సినిమాల్లా ఈజీగా సక్సెస్‌ అయిపోతే ఇక పూజ బాలీవుడ్‌ లేదా టాలీవుడ్‌లో ఎక్కడ సెటిల్‌ అవ్వాలనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English