వావ్.. ఆ సినిమాకు పది కోట్ల షేర్

వావ్.. ఆ సినిమాకు పది కోట్ల షేర్

క్రిస్మస్ వీకెండ్లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన కన్నడ డబ్బింగ్ సినిమా ‘కేజీఎఫ్’.. ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగులో వసూళ్ల వర్షం కురిపిస్తూ సాగిన సంగతి తెలిసిందే. అదే వీకెండ్లో రిలీజైన ‘పడి పడి లేచె మనసు’.. ‘అంతరిక్షం’ సినిమాలు వీకెండ్ ముగియకముందే పడుకుండిపోగా.. ‘కేజీఎఫ్’ మాత్రం వీక్ డేస్‌లో సైతం హౌస్ ఫుల్స్‌తో నడుస్తూ సంచలనం సృష్టించింది.

మొదట్లో ఈ సినిమా జోరు చూసి ఫుల్ రన్లో రూ.5 కోట్ల షేర్ మార్కును దాటొచ్చని అంచనా వేశారు. కానీ వారం తిరక్కముందే ఆ క్లబ్బులోకి అడుగుపెట్టిన ‘కేజీఎఫ్’.. రెండో వీకెండ్లోనూ వసూళ్ల మోత మోగిస్తూ కొత్త లక్ష్యాల వైపు అడుగులేసింది. ఇప్పుడా చిత్రం ఏకంగా రూ.10 కోట్ల షేర్ మార్కును టచ్ చేయడం విశేషం. గ్రాస్ రూ.20 కోట్ల దాకా ఉంది.

అసలు మనకు పరిచయమే లేని హీరో సినిమా.. అందునా కన్నడ డబ్బింగ్ చిత్రం ఇక్కడ రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం హిందీలోనూ ఇదే స్థాయిలో సంచలనం రేపింది. అక్కడ ‘కేజీఎఫ్’ గ్రాస్ వసూళ్లు రూ.35 కోట్లకు పైగా ఉండటం విశేషం. తమిళంలో కూడా ‘కేజీఎఫ్’ బాగానే ఆడుతోంది. ఇక కన్నడలో అయితే చెప్పాల్సిన పని లేదు. అక్కడి ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ ‘కేజీఎఫ్’ బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది.

ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.150 కోట్ల గ్రాస్ మార్కును దాటుతుందని అంచనా. కన్నడ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద ఫిగరే. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రెండో చాప్టర్‌పై అంచనాలు ఏ స్థాయికి చేరుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English