అల్లు శిరీష్‌ తగ్గట్లేదు

అల్లు శిరీష్‌ తగ్గట్లేదు

గౌరవం చిత్రంతో పరిచయమైన అల్లు అర్జున్‌ తమ్ముడు అల్లు శిరీష్‌ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. హీరో మెటీరియల్‌ కాదంటూ విమర్శకులు కొట్టి పారేశారు. అయితే తనలో ఖచ్చితంగా హీరో ఉన్నాడనేది అల్లు శిరీష్‌ నిశ్చితాభిప్రాయం. అందుకే తనపై వచ్చిన విమర్శలని అతను అస్సలు లెక్క చేయట్లేదు. గౌరవం ఫ్లాపయినా కానీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. హీరోలానే సందడి చేస్తున్నాడు. తనని తీసి పారేసిన వారి నోళ్లు మూయించి తన టాలెంట్‌ చూపించాలని శిరీష్‌ ఉరకలేస్తున్నాడు.

తన రెండో సినిమా 'కొత్త జంట'లో అల్లు శిరీష్‌ సరదాగా తిరిగే యువకుడి పాత్ర చేస్తున్నాడు. గౌరవంలో సీరియస్‌ రోల్‌ చేసిన శిరీష్‌ ఈసారి జోవియల్‌గా అలరించాలని కలలు కంటున్నాడు. యూత్‌ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మారుతి ఈసారి పెద్ద బ్యానర్‌లో, మంచి బ్యాకింగ్‌తో ఈ సినిమా తీస్తున్నాడు. మారుతికి యూత్‌ పల్స్‌ బాగా తెలుసంటారు కాబట్టి శిరీష్‌ సక్సెస్‌ఫుల్‌ దర్శకుడి చేతిలో పడ్డట్టే. అతని అదృష్టం ఎలాగుందో కొత్త జంట రిలీజయ్యాక చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు