కాజల్ బోల్డ్‌నెస్ ధాటికి రికార్డులు బద్దలు

కాజల్ బోల్డ్‌నెస్ ధాటికి రికార్డులు బద్దలు

ఒకట్రెండు క్షణాల్లో ముగిసిపోయే ఒక షాట్.. అదే ఇప్పుడు యూట్యూబ్‌లో ప్రకంపనలు రేపుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చి పెడుతోంది. ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో ఇప్పటిదాకా 74 లక్షల మంది చూడటం విశేషం. ఇప్పటిదాకా సౌత్ ఇండియాలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా టీజర్‌కు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ టీజర్‌ పేరిట ఉన్న రికార్డును ‘ప్యారిస్ ప్యారిస్’ బద్దలు కొట్టింది. ఈ టీజర్ ఇంతగా జనాల దృష్టిని ఆకర్షించడానికి కారణమేంటో తెలిసిందే. ఇందులోని బూబ్ ప్రెస్ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అలాంటి బోల్డ్ సీన్‌కు కాజల్ ఒప్పుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు.


దాని మీద పెద్ద డిస్కషన్ నడవడంతో కుర్రాళ్లు విరగబడి టీజర్ చూశారు. టీజర్ వచ్చి రెండు వారాలైనప్పటికీ ఇంకా ఇంకా వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ‘ప్యారిస్ ప్యారిస్’ హిందీ హిట్ మూవీ ‘క్వీన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రాన్ని తెలుగు.. మలయాళం.. కన్నడ భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. కానీ ఆ టీజర్లకు ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. మలయాళ, కన్నడ వెర్షన్లకు ఒక మిలియన్ పైచిలుకు వ్యూస్ వచ్చాయంతే.

తెలుగులో తమన్నా నటించబట్టి ‘దటీజ్ మహాలక్ష్మి’కి 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నిజానికి తెలుగులో కూడా ఇలాంటి షాట్ ఉందేమో అని జనాలు వెతకడం వల్ల కూడా దీనికి వ్యూస్ పెరిగినట్లు చెబుతున్నారు. మిగతా మూడు టీజర్లూ కలిపినా కూడా ‘ప్యారిస్ ప్యారిస్’ వ్యూస్ ఇంకో 1.5 మిలియన్లు ఎక్కువే ఉండటం విశేషం. దీన్ని బట్టే ఆ చిన్న షాట్ ఎంత ప్రభావం చూపిందన్నది అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English