ఆ 'నొక్కుడు'కి తమన్నా నో నో!

ఆ 'నొక్కుడు'కి తమన్నా నో నో!

క్వీన్‌ తెలుగు, తమిళ రీమేక్స్‌ టీజర్స్‌ ఒకేసారి విడుదలయితే కాజల్‌ నటించిన పారిస్‌ పారిస్‌ టీజర్‌ సంచలనమయింది. తమన్నా చేస్తోన్న తెలుగు రీమేక్‌ దటీజ్‌ మహాలక్ష్మి సోదిలో లేకుండా పోయింది. కాజల్‌ టీజర్‌ అంతగా సెన్సేషన్‌ కావడానికి కారణం 'బ్రెస్ట్‌ ప్రెస్‌' క్లిప్‌. ఎల్లీ అవ్రామ్‌ కాజల్‌ స్తనాలపై చేతులేసి నొక్కడం, దానికి కాజల్‌ ఇన్‌స్టంట్‌ రియాక్షన్‌ వల్ల ఆ క్లిప్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అయి, మీమ్‌ మేకర్స్‌కి పండగలా మారింది. హిందీ ఒరిజినల్‌లో సిమిలర్‌ షాట్‌ వుందని, అదే చేసాము తప్ప సంచలనం కోసం చేయలేదని దర్శకుడు రమేష్‌ అరవింద్‌ చెబుతున్నాడు.

ఒరిజినల్‌లో వుంది కనుక కాజల్‌ ఒప్పేసుకుంది. మరి తమన్నా టీజర్‌లో ఆ షాట్‌ ఎందుకు లేదు? ఆ షాట్‌ చేయడానికి తమన్నా ససేమీరా అని చెప్పిందట. ఎంత ఫన్నీగా అనిపించినా, చేసేది మరో స్త్రీనే అయినా కానీ వల్గర్‌గా అనిపించే అవకాశముందని, అంచేత ఆ సీన్‌ అయితే చేయనని తెగేసి చెప్పిందట. ఎంత చెప్పినా తమన్నా కన్విన్స్‌ కాకపోయే సరికి ఆ షాట్‌ లేకుండానే షూట్‌ చేసారు. అయితే తమిళ టీజర్‌కి వస్తోన్న రెస్పాన్స్‌ చూసి మహాలక్ష్మి మనసు మార్చుకుంటుందేమో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English