ఇస్మార్ట్ శంకర్ కోసం ఆయనొచ్చాడు

ఇస్మార్ట్ శంకర్ కోసం ఆయనొచ్చాడు

వరుస ఫ్లాపులతో ప్రాభవం కోల్పోయిన అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్.. యువ కథానాయకుడు రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. పూరి ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినేసి ఆయన సినిమాలకు మునుపటి క్రేజ్ కనిపించడం లేదు. ఐతే ‘ఇస్మార్ట్ శంకర్’కు ఎలాగైనా హైప్ తేవాలన్న పట్టుదలతో దీన్ని ముందు నుంచే గట్టిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా ఎంత హడావుడి నెలకొందో తెలిసిందే.

ఇక తర్వాతి రోజే ఒక హాట్ అప్ డేట్‌తో మీడియాను పలకరించింది చిత్ర బృందం. ఈ చిత్రానికి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు వెల్లడైంది. పూరితో మణిశర్మ చాలా సినిమాలకు పని చేశాడు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘పోకిరి’ పెద్ద మ్యూజికల్ హిట్. దీంతో పాటుగా ‘చిరుత’.. ‘కెమెరామన్ గంగతో రాంబాబు’.. ‘ఏక్ నిరంజన్’ లాంటి సినిమాలకు పని చేశారు పూరి-మణి. పూరి చివరి హిట్ ‘టెంపర్’కు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించింది కూడా మణిశర్మే.

ఒకప్పుడు టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక వెలుగు వెలిగిన మణిశర్మ.. తర్వాత బాగా జోరు తగ్గించేశాడు. ఈ మధ్య కొంచెం రైజ్ అయినట్లే కనిపించాడు కానీ.. మళ్లీ స్లో అయ్యాడు. ఈ దశలో పూరితో జట్టు కట్టడం ఆసక్తి రేకెత్తించే విషయమే. ‘ఇస్మార్ట్ శంకర్’ను పూరి తన సొంత బేనర్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరించనుంది. ఇందులో కథానాయిక.. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఎప్పట్లాగే ఈ చిత్రాన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నాడు పూరి జగన్నాథ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English