వైబ్రేటర్ సీన్ గురించి కియార ఏమందంటే..?

వైబ్రేటర్ సీన్ గురించి కియార ఏమందంటే..?

‘ఎం.ఎస్.ధోని: అన్ టోల్డ్ స్టోరీ’.. ‘భరత్ అనే నేను’ లాంటి సినిమాల్లో చాలా అందంగా.. సంప్రదాయ బద్ధంగా కనిపించి ఆకట్టుకున్న భామ కియారా అద్వానీ. ఈ రెండు సినిమాల్లో ఆమెను చూసి ట్రెడిషనల్ హీరోయిన్ ముద్ర వేసేశారు జనాలు. అలా ఆలోచించిన వాళ్లకు ‘లస్ట్ స్టోరీస్’తో పెద్ద షాకే ఇచ్చిందామె. అందులో ఆమె బోల్డ్ నెస్ చూసి దిమ్మదిరిగిపోయింది.

భర్త శృంగార పరమైన తృప్తిని ఇవ్వకపోవడంతో వైబ్రేటర్ తెచ్చుకుని దాని ద్వారా స్వయం తృప్తి పొందే గృహిణిగా ఆమె నటించిన తీరు షాకింగే. దీనికి సంబంధించిన సన్నివేశాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ సీన్లు మోత మోగించేశాయి. ఈ వెబ్ సిరీస్‌లో కియారా పేరు మార్మోగిపోయింది. ముందు ఆమె చేసిన సినిమాలకు.. ఈ వెబ్ సిరీస్‌కు అసలు పోలికే లేదు.

కియారాను ఇలా చూసి ఫీలైన అభమానులూ ఉన్నారు. ఐతే ‘లస్ట్ స్టోరీస్’లో నటించడం పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవంటోంది కియారా. తెలుగులో తన కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’ ప్రమోషన్లో భాగంగా మీడియాను కలిసి కియారా..ఆ సన్నివేశాల్ని జనాలు సరదాగానే తీసుకోవాలని ఆమె చెప్పింది.  అవన్నీ వినోదంలో భాగంగా తెరకెక్కించిన సన్నివేశాలే అని కియారా అంది. వాటిని బూతులా భావించాల్సిన అవసరం లేదని.. సెక్స్ కోరికల గురించి ఆ వెబ్ సిరీస్‌లో చాలా అందంగా.. వినోదాత్మకంగా చూపించారని కియారా చెప్పింది.

‘లస్ట్ స్టోరీస్‌’లో కేవలం సెక్స్ గురించి మాత్రమే చూపించలేదని.. అంతకుమించి చాలా విషయాలే ఉన్నాయని.. ప్రస్తుత తరానికి ఇలాంటివి చాలా అవసరమని ఆమె అంది. ఇకు ముందు కూడా ఇలాంటి వెబ్ సిరీస్‌లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె చెప్పింది. మరి సినిమాల్లో కూడా ఇంతే బోల్డ్‌గా కనిపిస్తారా అంటే కియారా సమాధానం చెప్పకుండా నవ్వేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English