దిల్‌ రాజు సినిమా బాలకృష్ణ చేతిలోకి!

దిల్‌ రాజు సినిమా బాలకృష్ణ చేతిలోకి!

బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రం ప్రపోజల్‌ వున్న సంగతి తెలిసిందే. బాలయ్య వందవ చిత్రం పనులతో బిజీగా వుండడం వల్ల, ఆ తర్వాత రావిపూడి బిజీ అయిపోవడం వల్ల అది సాధ్యపడలేదు. అయితే బాలయ్యకి అప్పట్లో అనిల్‌ రావిపూడి చెప్పిన కథ బాగా నచ్చేసిందట. అందుకే అతడికి మళ్లీ కబురు పంపించి ఎప్పుడు చేద్దామని అడిగాడట. ఎఫ్‌2 విడుదల, ప్రమోషన్స్‌ అయ్యాక అనిల్‌ రావిపూడి అదే కథపై కసరత్తు మొదలు పెడతాడు. అయితే ఈ చిత్రాన్ని మొదట ప్రపోజ్‌ చేసినపుడు దిల్‌ రాజు నిర్మించాలని భావించాడు.

అనిల్‌ రావిపూడితో అప్పుడు దిల్‌ రాజుకి మూడు సినిమాలకి కాంట్రాక్ట్‌ వుంది. ఎఫ్‌2తో ఆ కాంట్రాక్ట్‌ పూర్తయింది కానీ దిల్‌ రాజు ద్వారానే బాలయ్యని కలిసాడు కనుక ఇదీ అతనికే చేద్దామని అనిల్‌ రావిపూడి భావిస్తున్నా కానీ బాలయ్య మాత్రం ఇప్పుడు బయటి బ్యానర్లకి సినిమాలు చేయడానికి సుముఖంగా లేరు. ఎన్టీఆర్‌ బయోపిక్‌తో ఎన్‌బికె ఫిలింస్‌ సంస్థని స్థాపించిన బాలకృష్ణ ఇకపై తాను నటించే అన్ని సినిమాలనీ సొంత బ్యానర్లోనే చేయాలని డిసైడ్‌ అయ్యారు. కనుక ఈ చిత్రం ఖచ్చితంగా బాలయ్య బ్యానర్లోనే వుంటుందని చెప్పవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English