ఎవరి కోసమీ యాత్ర?

ఎవరి కోసమీ యాత్ర?

బయోపిక్‌ తెరకెక్కుతోందంటే దానిపై అమితాసక్తి నెలకొనడం సహజం. అయితే ఒక మహానాయకుడి జీవితాన్ని తెరకెక్కించే మహదవకాశాన్ని వినియోగించుకోకుండా కేవలం ఆయన జీవితంలోని కొన్ని పేజీలని మాత్రమే చూపిస్తామంటే ఇక దానిపై ఆసక్తి ఎలా ఏర్పడుతుంది? వైఎస్‌ రాజశేఖరరెడ్డి బయోపిక్‌ వస్తుందని తెలిసినపుడు అభిమానులు ఎక్సయిట్‌ అయ్యారు. ఫ్యాక్షన్‌ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రిగా వరుసగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టడం వరకు వైఎస్‌ జీవితంలో చాలా డ్రామా వుంది.

అయితే ఆయన జీవితాన్ని కాకుండా కేవలం పాద యాత్ర చేయడానికి సంకల్పించడానికి కారణాలు, ఆ పాద యాత్రలో ఆయనకి ఎదురైన అనుభవాలని మాత్రమే ఇందులో చూపిస్తున్నారు. ఇది కరడు కట్టిన వైఎస్‌ అభిమానులకి మినహా మరెవరికీ ఆసక్తి కలిగించని కథాంశం. అందుకే యాత్రలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తోన్నా కానీ దీనిపై ఎలాంటి బజ్‌ ఏర్పడలేదు. ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు పాటలని కూడా విడుదల చేసారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండవ భాగంతో పాటు యాత్ర కూడా రిలీజ్‌ అవుతోన్న నేపథ్యంలో దీనిపై అమితమైన ఆసక్తి రేకెత్తించాలి. ఒకవైపు ఎన్టీఆర్‌ బయోపిక్‌పై అంచనాలు తారాస్థాయిలో వుంటే యాత్ర గురించి కనీసం ఎవరూ పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English