రామ్-పూరి.. పిచ్చి పీక్స్

రామ్-పూరి.. పిచ్చి పీక్స్

పూరి జగన్నాథ్ అనగానే ఆయన తీర్చిదిద్దిన ఎక్స్‌ట్రీమ్ హీరో క్యారెక్టర్లే గుర్తుకొస్తాయి. అప్పటిదాకా టాలీవుడ్లో హీరో క్యారెక్టర్లు స్టీరియో టైపులో ఉండేవి. రాముడు మంచి బాలుడు తరహా పాత్రల్లోనే కనిపించేవాళ్లు హీరోలు. ఐతే పూరి మాత్రం తన హీరో పాత్రలకు కొంచెం నెగెటివ్ టచ్ ఇచ్చి.. వాళ్లను తేడాగాళ్లుగా చూపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండే ఆ క్యారెక్టర్లను జనాల్లోకి బాగా తీసుకెళ్లాడు. ఐతే ఒక దశ వరకు పూరి పాత్రలు బాగానే ప్రేక్షకులకు కనెక్టవుతూ వచ్చాయి కానీ.. ఆ తర్వాత కథ మారింది. కేవలం హీరో పాత్ర మీదే ఫోకస్ చేస్తూ కథల మీద కసరత్తు తగ్గించేశాడు పూరి. అదే సమయంలో పూరి మార్కు క్యారెక్టర్లు కూడా మొహం మొత్తడం మొదలైంది. దీంతో వరుసగా ఫెయిల్యూర్లు పలకరించాయి.

చివరగా ‘మెహబూబా’ సినిమాలో తన శైలికి భిన్నంగా ట్రై చేశాడు పూరి. ఫలితం మరింత ఘోరంగా వచ్చింది. దీంతో ఇక లాభం లేదని పూరి మళ్లీ ఓల్డ్ స్టయిల్‌కు వెళ్లిపోయాడు. రామ్‌తో చేస్తున్న కొత్త సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో పాత్ర చాలా వైల్డ్‌గా, ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుందని సమాచారం. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదే సంకేతాలిచ్చింది. రామ్ మామూలుగానే యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్లు చేయడంలో దిట్ట. ఇక అతడికి పూరి తోడైతే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పేదేముంది. ఇద్దరూ ఆలౌట్ వార్‌కు రెడీ అయినట్లే ఉన్నారు. హీరో క్యారెక్టర్‌ మరీ ఎక్స్‌ట్రీమ్‌గా.. పిచ్చి పీక్స్ అనిపించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌‌ను తలకిందులుగా చూపించడంతోనే వ్యవహారం ఎంత తేడా ఉండబోతుందో జనాలకు సంకేతాలు ఇచ్చినట్లుంది పూరి-రామ్ జోడీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English