అది పోయింది.. దీనికి క్రెడిట్ రాదు

అది పోయింది.. దీనికి క్రెడిట్ రాదు

పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చే వారసులు కెరీర్ ఆరంభంలో మాస్ మసాలా సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. మొదట్లో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంటే ఆ తర్వాత అది ఓపెనింగ్స్‌కు బాగా కలిసొస్తుంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఆరంభ వసూళ్లు దక్కుతుంటాయి. కానీ గత కొన్నేళ్లలో మాస్ సినిమాలకు ఆదరణ బాగా తగ్గిపోయింది. ప్రేక్షకుల అభిరుచి మారి కొత్త తరహా సినిమాలకే పట్టం కడుతున్నారు. దీంతో యంగ్ హీరోలు కూడా ఆ తరహా సినిమాలే చేస్తున్నారు. కానీ క్లాస్ సినిమాలతో ఎన్ని హిట్లు కొడుతున్నా.. మార్కెట్ మాత్రం అనుకున్న స్థాయిలో పెరగట్లేదు. ఇందుకు నాగచైతన్య, వరుణ్ లేజ్ లాంటి హీరోలే ఉదాహరణ.

వరుణ్ సంగతే తీసుకుంటే.. వరుసగా రెండు పెద్ద హిట్లు కొట్టినా అతడి మార్కెట్ అనుకున్న స్థాయిలో పుంజుకోలేదని ఈ మధ్యే రుజువైంది. గత ఏడాది అతను నటించిన ‘ఫిదా’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఈ ఏడాది ‘తొలి ప్రేమ’తో మరో హిట్ కొట్టాడు. అయినప్పటికీ అతడి కొత్త సినిమా ‘అంతరిక్షం’కు అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదు. నిర్మాతలు చెప్పిన రేట్లకు బయ్యర్లు కొనడానికి ముందుకు రాకపోవడంతో ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. రూ.20 కోట్ల దాకా బడ్జెట్ పెడితే.. థియేట్రికల్ రన్ ద్వారా రూ.10 కోట్లు కూడా వెనక్కి రాని పరిస్థితి. ఈ సినిమాతో తన కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనకుంటే.. అది జరగకపోగా ఎదురు దెబ్బ తగిలింది.

ఐతే వరుణ్ తర్వాతి సినిమా ‘ఎఫ్-2’కు మంచి క్రేజే ఉంది. మంచి కామెడీ ఎంటర్టైనర్‌ లాగా కనిపిస్తున్న ఈ చిత్రం స్యూర్ షాట్ హిట్ అంటున్నారు. కానీ సమస్య ఏంటంటే.. ఈ చిత్రం ఆడినా వరుణ్ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎలాగూ వెంకీ ఉన్నాడు కాబట్టి.. కామెడీలో ఆయన కింగ్ కాబట్టి సక్సెస్ క్రెడిట్ ఆయన ఖాతాలోకే వెళ్లిపోతుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజులకూ కొంత క్రెడిట్ వెళ్తుంది. ఇందులో ఇద్దరు గ్లామర్ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇందరి మధ్య వరుణ్ ఏమాత్రం ప్రత్యేకతను చాటుకుంటాడన్నది డౌటే. అసలు కామెడీ విషయంలో వెంకీ ముందు అతను నిలుస్తాడా అన్న సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ ఈ సినిమాపై పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. సోలో హీరోగా ఇంకో పెద్ద హిట్టు కొట్టి తనేంటో రుజువు చేసుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English