‘2.0’ ఎంతకు ముంచింది?

‘2.0’ ఎంతకు ముంచింది?

మొత్తానికి ముందు నుంచి ఉన్న సందేహాలే నిజమయ్యాయి. ‘2.0’ చివరికి లాస్ వెంచరే అయ్యింది. ఈ చిత్రానికి ఎంత హైప్ తెద్దామని చూసినా.. రిలీజ్ తర్వాత ఎంత పబ్లిసిటీ చేసినా ఫలితం లేకపోయింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రానికి రిలీజ్ తర్వాత కొన్ని అంశాలు కలిసి వచ్చినా కూడా లాభం లేకపోయింది. ఒక్క హిందీలో మినహాయిస్తే అన్ని చోట్లా ‘2.0’ బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది.

ముఖ్యంగా ఈ సినిమా తమిళంలో బయ్యర్లను నిలువునా ముంచేయడం ఆశ్చర్యకరమైన విషయం. తమిళనాట ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.100 కోట్లకు పైగా రేటుతో అమ్మారు. కానీ అక్కడ ఇప్పటిదాకా వచ్చిన షేర్ రూ.60 కోట్ల లోపే ఉంది. బయ్యర్లకు కనీసం 40 శాతం నష్టాలు తప్పట్లేదని సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. ఇక పెద్దగా ఆశల్లేవు.

తమిళంతో పోలిస్తే నయమే కానీ.. తెలుగులో కూడా నష్టాలు తప్పలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు.. ఎన్వీ ప్రసాద్ కలిసి రిలీజ్ చేశారు. తెలుగు హక్కుల కోసం వాళ్లు రూ.72 కోట్లు పెట్టినట్లు సమాచారం. కానీ ఈ చిత్రం ఫుల్ రన్లో వసూలు చేసిన షేర్ రూ.55 కోట్లే. అంటే నాలుగింట మూడో వంతు మాత్రమే పెట్టుబడి వెనక్కి వచ్చింది. 20-25 శాతం మధ్య నష్టాలు తప్పలేదు.

కాకపోతే రిలీజ్ ముంగిట.. తర్వాత వచ్చిన డివైడ్ టాక్ చూస్తే ఈ చిత్రం ఈ మాత్రమైనా వసూళ్లు రాబడుతుందని అనుకోలేదు. దీనికి రెండు వారాల పాటు పోటీనే లేకపోవడం కలిసొచ్చింది. అయ్యో అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారే అని.. జనాలు కూడా దీని గురించి నెగెటివ్ ప్రచారం పెద్దగా చేయలేదు. ఐతే హిందీలో మాత్రం ‘2.0’ బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చింది. కరణ్ జోహార్ రూ.100 కోట్లకు హక్కులు కొని రిలీజ్ చేస్తే దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిందీ చిత్రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English