సూపర్ స్టారూ.. ఇదేమి ఓవర్ యాక్షన్?

సూపర్ స్టారూ.. ఇదేమి ఓవర్ యాక్షన్?

ఏదైనా ఒక లిమిట్ లో ఉంటేనే దానికో అర్థం ఉంటుంది అంటారు. అయితే అభిమానం డోస్ అనేది అన్ లిమిటెడ్ డోస్ అని మన సౌత్ లో స్టార్ ల క్రేజ్ ను చుస్తే అర్ధమవుతుంది. ఇక స్టార్స్ ఓవర్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం రజినీకాంత్ కూడా అలానే చేస్తున్నారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్యన 2పాయింట్0 తప్పితే తలైవా చేసిన సినిమాలన్నీ రొటీనే. స్టైల్ లో కొత్తగా కనిపించినా అందులో న్యూ పాయింట్ ఏమి కనిపించడం లేదు. కబాలి అండ్  కాలా నుంచి కమర్షియల్ హంగులతో స్టయిల్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. కబాలి అంటే ఒకే కానీ కాలాలో అదే ఎలివేట్ చేశారు. ఇక ఇప్పుడు పేట సినిమా ట్రైలర్ చూస్తే అదే భావన కలుగుతోంది. డైలాగ్స్ అయితే పెద్దగా ఆకట్టుకునేలా లేవు. రొటీన్ గానే తన మేనరిజంతో రజనీ కనిపించడం చూస్తుంటే తెలుగులో ఆడటం అనేది డౌట్ గానే ఉంది. కేవలం ఓవర్ యాక్షన్ ను నమ్ముకుంటే కష్టమే తలైవా.

ఇక తమిళ్ లో కూడా పేట సినిమా ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చెప్పడం కష్టం. అసలే ఈ మధ్య ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 2పాయింట్0 కోలీవుడ్ లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తెలుగులో అయితే బయ్యర్లకు పెద్దగా లాభాలు రాలేదు. దీంతో పేట సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మొన్నటివరకు ట్రైలర్ ఏమైనా బూస్ట్ ఇస్తుందేమో చూడాలి అనుకున్నప్పటికి రొటీన్ రజినీకాంత్ దర్శనమిచ్చాడు. మరి సినిమా మొత్తంలో తలైవా ఇదే ఓవర్ యాక్షన్ చేస్తాడా లేక ఆ యాక్షన్ సినిమాకు తగ్గట్టుగా ఉంటుందా? అనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English