రూమర్‌: వెంకీ ఫ్రస్ట్రేషన్‌?

రూమర్‌: వెంకీ ఫ్రస్ట్రేషన్‌?

కొత్త సినిమా వస్తోందంటే దాని గురించిన వేడి వేడి వదంతులు మీడియాలో షికారు చేయడం మామూలే. ఈ పుకారులో వాస్తవమెంత అనేది పక్కన పెడితే ప్రస్తుతం సర్కులేషన్‌లో వున్న హాట్‌ గాసిప్స్‌లో ఇదొకటి. సంక్రాంతికి విడుదల కాబోతోన్న 'ఎఫ్‌2' చిత్రంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన సంగతి తెలిసిందే. టీజర్లో వీరిద్దరి కెమిస్ట్రీ వల్ల ఇప్పటికే ఈ చిత్రం చాలా మందికి 'మస్ట్‌ వాచ్‌' లిస్ట్‌లోకి చేరిపోయింది. ఇదిలావుంటే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో మాత్రం వెంకటేష్‌ పలుమార్లు అసహనానికి లోనయ్యారని వదంతులు వినిపిస్తున్నాయి.

ఫుల్‌ స్క్రిప్ట్‌ చేతిలో లేకుండా సెట్స్‌ మీదకి వెళ్లడం వల్ల దర్శకుడు అనిల్‌ రావిపూడి సెట్లోనే సీన్లు వండడం చేసాడట. ఇది వెంకటేష్‌కి నచ్చలేదట. మంచి ఫన్‌ కాన్సెప్ట్‌ వున్న సినిమాకి స్పాట్‌ డెవలప్‌మెంట్స్‌ ఏమిటని విసుక్కువేవాడట. అయితే వెంకీ ఫ్రస్ట్రేషన్‌ తగ్గించడానికి ఆయనపై మరింత ఫన్నీ సీన్లు వర్కవుట్‌ చేసారని, తద్వారా ఇద్దరు హీరోల సినిమాలో వెంకీ డామినేషన్‌ కూడా పెరిగిందని, మధ్యమధ్యలో ఫ్రస్ట్రేట్‌ అయినా కానీ సినిమా పూర్తయ్యాక మాత్రం వెంకీ హ్యాపీగానే వున్నారని, దిల్‌ రాజు బ్యానర్లో మరో సినిమా చేయడానికి అంగీకరించారని ఆ వదంతుల సారాంశం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English