టాటూ సీక్రెట్ చెప్పేసిన అనసూయ

టాటూ సీక్రెట్ చెప్పేసిన అనసూయ

యాంకర్ అనే పదానికి సరికొత్త ఘాటు అర్థం చెప్పిన వారిలో తెలుగునాట అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్ర పోషించందనే చెప్పాలి. రియాలిటీ షోలకు గ్లామర్ టచ్ ఇచ్చి సరికొత్తగా రేటింగ్ పెంచేసింది. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రంగస్థలం రంగమ్మత్త కు ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. అయితే అనసూయకి అభిమానించే వారంటే చాలా కోపమని ఆమెను సెల్ఫీ అడిగితేనే ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అనే విమర్శలు చాలా ఉన్నాయి.

ఆమె ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన సందర్భాల గురించి అందరికి తెలిసిందే. కానీ ఇటీవల యాంకరమ్మ ట్విట్టర్ లో చాలా సున్నితంగా అభిమానులతో చిట్ చాట్ చేశారు.అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనసూయ తన ఛాతిపై ఉన్న టాటూ విషయం గురించి కూడా చెప్పింది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఆ పచ్చ బొట్టుపై అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.  ఎట్టకేలకు జబర్దస్త్ యాంకర్ టాటూ గుట్టు బయటపెట్టేసింది.

మీ ఛాతిపై ఉన్న టాటూకి అర్ధమేంటని అడిగిన ఓ నెటిజన్ ప్రశ్నకు వివరణ ఇస్తూ.. 'అది నీక్కు.. నా భర్త ముద్దు పేరు' అని చెప్పింది. అలాగే తన ఇష్టాల గురించి కూడా అడిగిన ప్రతి ఒక్కరికి స్వీట్ గా సమాధానం చెప్పింది. ఇక ఈ ఏడాది రంగస్థలం బెస్ట్ మూవీ అంటూ క్షణం కూడా తన కెరీర్ లో మరచిపోలేని మంచి మూవీ అని అనసూయ పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English