కొలంబస్‌!!!!..... అదే మహేష్‌ టైటిలంట

కొలంబస్‌!!!!..... అదే మహేష్‌ టైటిలంట

వార్ని.. అసలు ఏ ముహూర్తాన సుకుమార్‌ సినిమాను మొదలెట్టారో కాని, ఇప్పుడు ఈ టైటిల్స్‌తో రోజుకోసారి షాకిస్తూనే ఉన్నారు. నిన్నకాక మొన్న సుకుమార్‌ దర్శకవత్సంలో వస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సినిమా పేరు 'వన్‌' అంటూ వదంతులు వినిపించగ, ఇక లేటెస్ట్‌ రిపోర్టు ఏంటంటే, ఈ సినిమా పేరు 'కొలంబస్‌' అంటున్నారు. ఇప్పటికే ఆచార్య, తుంటరి, సునామి వంటి టైటిల్స్‌తో విస్తుపోయిన మహేష్‌ బాబు అభిమానులు, ఇప్పుడు 'కొలంబస్‌' పేరు విని వేసవి ఎండల్లో మంచు కురిస్తే బాగుండు అనుకుంటున్నారు.  


అయితే ఈ సినిమాలో మహేష్‌ పేరు కొలంబస్‌ అని, అతను వివిధ దేశాలు తిరుగుతూ అందర్నీ కనిపెడుతూ ఉంటాడంటే, అందుకే ఆ పేరు పెట్టారని చెబుతున్నారు. మొత్తానికి ఇంకో వారం రోజుల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందే మహేష్‌ సినిమా టైటిల్‌ ప్రకటిస్తారని తెలిసినా, రూమర్‌ రాయుళ్ళు మాత్రం ఆగేలా కనిపించడంలేదు. ఒకవేళ నిజంగానే 'కొలంబస్‌' సినిమా టైటిలైతే, ఇక సూపర్‌స్టార్‌ ఫ్యాన్సే చెప్పాలి...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు