డైరెక్టర్ మారుతి.. హిలేరియస్ ట్వీట్

డైరెక్టర్ మారుతి.. హిలేరియస్ ట్వీట్

టాలీవుడ్ దర్శకుడు మారుతికి చిత్రమైన ఇబ్బంది ఎదురైంది. అతడి ట్విట్టర్ హ్యాండిల్లో ‘మారుతి డైరెక్టర్’ అనే పేరుంటుంది. అది చూసి ఒక నెటిజన్ పొరబడ్డాడు. తన మారుతి కారు విషయంలో తలెత్తిన సమస్యను అతడితో విన్నవించుకున్నాడు. తన ఇబ్బంది తీర్చాలని కోరాడు. దీనికి మారుతి సరదాగా సమాధానం ఇచ్చాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో జనాలకు మంచి వినోదాన్నిచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

‘‘నా మారుతి స్విఫ్ట్‌ కారు ఇంజిన్‌ కాలిపోయింది. 2015 మేలో కొనుగోలు చేశాను. బీమా ఉంది కానీ కవరేజ్‌లో లేదు. దాంతో కారులోని భాగాలను మళ్లీ అమర్చేందుకు రూ.180000 అడిగారు. ఇంజిన్‌కు కనీసం ఐదేళ్ల వారెంటీ అయినా ఉంటుంది. కానీ నా కారు విషయంలో మాత్రం వారెందుకు డబ్బులు అడుగుతున్నారు’’ అని ప్రశ్నిస్తూ శరవణ అనే వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో పాటు డైరెక్టర్ మారుతి పేరును అతను ట్యాగ్‌ చేశాడు.

ఈ ట్వీట్ కు మారుతి బదులిచ్చాడు. ‘‘డియర్‌ సర్‌.. నేను సినిమా డైరెక్టర్‌ మారుతిని. నాకు మారుతి స్విఫ్ట్‌ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు. మీ ఫిర్యాదు సరైన వారికి చేరుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. హ్యాపీ న్యూఇయర్‌’ అని మారుతి ట్వీట్ చేశాడు. తప్పు తెలుసుకున్న శరవణ సదరు కంపెనీకి ట్యాగ్‌ చేశాడు. ఈ సంభాషణ సెలబ్రెటీలతో పాటు అందరికీ నవ్వు తెప్పించింది. అందరూ ఫన్నీ ఇమోజీలతో స్పందించారు. కొందరు మారుతిని సరదాగా ఏడిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English