ఇది కోలీవుడ్ ‘చక్ దే ఇండియా’నట

ఇది కోలీవుడ్ ‘చక్ దే ఇండియా’నట

షారుఖ్ ఖాన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమా ‘చక్ దె ఇండియా’. అందులో షారుఖ్ హాకీ క్రీడాకారుడిగా.. కోచ్‌గా నటించాడు. అందులో కింగ్ ఖాన్ పాత్ర గురించి.. నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియాలో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాస్‌లో ‘చక్ దె ఇండియా’ను ఒకటిగా చెప్పుకోవచ్చు. దేశంలో యువతను ఎంతో ఇన్‌స్పైర్ చేసిన సినిమాల్లో అదొకటి. ఆ తర్వాత ఈ కోవలో హిందీలో చాలా సినిమాలు వచ్చాయి.

ఐతే దక్షిణాదిన ఇలాంటి పర్ఫెక్ట్ స్పోర్ట్స్ డ్రామాలు రావడం తక్కువ. మన దగ్గర ఈ మధ్యే ఇలాంటి సినిమాలకు ఊపు వస్తోంది. తెలుగులో ప్రస్తుతం నాని హీరోగా ‘జెర్సీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో నాని రంజీ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. మరోవైపు తమిళంలో ఇటీవలే ‘కనా’ అనే సినిమా స్పోర్ట్స్ మూవీ క్రిస్మస్ వీకెండ్లో రిలీజై మంచి విజయం సాధించింది.

ఈ కోవలోనే కోలీవుడ్లో మరో స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. ఐతే ఇది పైన చెప్పుకున్న సినిమాల్లో మాదిరి మరీ సీరియస్‌గా సాగదు. రియలిస్టిగ్గా ఉండదు. కొంచెం మసాలా అద్ది దాన్ని మాంచి కమర్షియల్‌గా సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. అందులో హీరోగా విజయ్ నటించనున్నాడు. అతడితో ‘తెరి’.. ‘మెర్శల్’ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడీ చిత్రాన్ని. ఇది కొంచెం ‘చక్ దె ఇండియా’ తరహాలో సాగుతుందట. విజయ్ ఇందులో ఫుట్ బాల్ కోచ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం విజయ్ లుక్ మార్చుకోవడమే కాక.. ఫుట్ బాల్ కోచ్‌ల దగ్గర శిక్షణ కూడా పొందుతున్నాడట.

విజయ్-అట్లీ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఎక్కుడో ఉన్నాయి. విజయ్ స్టామినాను బాగా వాడుకునే దర్శకుడిగా అట్లీ పేరు తెచ్చుకున్నాడు. ఈసారి కొంచెం వైవిధ్యమైన కథనే కమర్షియల్ స్టయిల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట అతను. నయనతార ఇందులో కథానాయికగా నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English