2.0తో రిటైర్‌ అయినట్టేనా?

2.0తో రిటైర్‌ అయినట్టేనా?

శంకర్‌, రజనీకాంత్‌ సినిమాలో నటిస్తే ఇక తనకి తిరుగుండదని ఏమీ జాక్సన్‌ భావించింది. అందుకే ఆ చిత్రం పూర్తయిన తర్వాత కూడా ఏ ఆఫర్లు స్వీకరించకుండా ఏడాది పాటు ఖాళీగా ఎదురు చూసింది. 2.0 కమర్షియల్‌గా డిజప్పాయింట్‌ చేయడమే కాకుండా ఏమీకి పేరు కూడా తెచ్చిపెట్టలేకపోయింది. అసలు ప్రాధాన్యత లేని పాత్రలో ఏమీ జాక్సన్‌ పూర్తిగా వేస్ట్‌ అయింది. దీంతో రియలైజేషన్‌ వచ్చేసిందో ఏమో ఏమీ సినిమాల మీద యావ తగ్గించుకుంది.

సినిమా పరిశ్రమ తనకి అంతగా కలసి రాలేదని డిసైడ్‌ అయి బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసేసుకుంది. అతనితో లివ్‌ ఇన్‌ రిలేషన్‌ కోసమని కొత్త అపార్ట్‌మెంట్‌లోకి కూడా షిఫ్ట్‌ అయింది. అతగాడు తనని అందరి కంటే సంతోషంగా వుంచుతాడంటూ అతని పెదవులు బంధించిన ఫోటోలని కూడా ఇంటర్నెట్‌లో పెడుతోంది. పార్టీలు, ఫ్రెండ్స్‌, బాయ్‌ ఫ్రెండ్‌ అంటూ బిజీ అయిపోయిన ఏమీ ఇక ఇండియాకి తిరిగి వచ్చే దాఖలాలు అయితే కనిపించడం లేదు. బ్రిటిష్‌ మోడల్‌ అయిన ఏమీకి అక్కడి సినిమాల్లో కూడా అవకాశాలు లేవు కనుక ఇక నటనకి స్వస్తి చెప్పి శేష జీవితాన్ని సరదాలతో గడిపేస్తుందేమో. ఏమీ ఎలాగో ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటోలు పెడుతూనే వుంటుంది కనుక అభిమానులు తనని అంతగా మిస్‌ అవర్లెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English