అమీ జాక్సన్.. జీవితంలో ఒక స్టెప్పేసింది

అమీ జాక్సన్.. జీవితంలో ఒక స్టెప్పేసింది

ఎవడు సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైన అమీ జాక్సన్ కెరీర్ ను ఓ ట్రాక్ లో తీసుకెళుతోంది. సక్సెస్ ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా తన గ్లామర్ తో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక అమ్మడి పెళ్లి వార్తల గురించి గత కొంత కాలంగా అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాస్త గ్యాప్ దొరికినా అమీ బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతోంది అంటూ కథనాలు వెలువడ్డాయి. ఇకపోతే అమీ ఈ ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందని  హింట్ అయితే ఇచ్చింది. లండన్ బేసిడ్ మిలియనిర్ జార్జ్ తో అమీ జాక్సన్ ఇటీవల రొమాంటిక్ స్టిల్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో అందుకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేస్తూ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.

'ఫస్ట్ జనవరి 2019 - మన న్యూ అడ్వెంచర్ లైఫ్ మొదలైంది. ఐ లవ్ యూ. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషం కలిగిన అమ్మాయిగా నన్ను మర్చినందుకు కృతజ్ఞతలని అమీ జాక్సన్ పేర్కొంది. రింగ్ సింబల్ కూడా ఇవ్వడంతో మ్యారేజ్ లైఫ్ పై అమ్మడు ఎంత సంతోషంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఒక స్టెప్పేసి ఎంగేజ్ చేసుకున్నందుకు (లేదంటే పెళ్ళిచేసుకున్నందుకు).. ఆమెకు విషెస్ చెప్పాల్సిందే.

ఇక సౌత్ నార్త్ అని తేడా లేకుండా అవకాశాలను అందుకుంటూ మరోవైపు హాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ గా 2.0 సినిమాతో అందరిని పలకరించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English