ఆవిరి అయిపోకుండా చూస్కో బాబూ

ఆవిరి అయిపోకుండా చూస్కో బాబూ

కామెడీ సినిమాలతో డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రవిబాబు ఎక్కువగా థ్రిల్లర్ జనర్ లో సక్సెస్ అందుకున్నాడు. ఆయన గత సినిమాలను చూసుకుంటే అనసూయ - అమరావతి అలాగే అవును సినిమాలు మంచి లాభాలను అందించాయి. మంచి టెక్నీషియన్ అని గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ మరికొన్ని ప్రయోగలతో మాత్రం గట్టి దెబ్బ తిన్నాడు.

పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనబడాలని చిత్రీకరణ విషయంలో రవిబాబు తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. రీసెంట్ గా పంది పిల్ల తో అదుగో సినిమా చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఆవిరి అనే మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అదుగో సినిమా కోసం ఈ దర్శకుడు ఎక్కువగా ఖర్చు చేశాడు. గ్రాఫిక్స్ కోసమని రెండేళ్ల సమయం కూడా తీసుకున్నాడు. అయితే సినిమాలో అసలైన కథనం మిస్ అయ్యింది. మొదటి షోకే రిజల్ట్ బెడిసికొట్టింది. ఏ వర్గం వారిని కూడా సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో భారీగా నష్టాలను చూడాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు హిట్టు కోసం సొంత డబ్బుతో మరో విజువల్ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నాడు. వరుసగా ప్లాప్స్ తో గత కొన్నేళ్లుగా ఆడియెన్స్ ని రవి బాబు బోర్ కొట్టించాడు.  ఇక ఇప్పుడైనా లెట్ చేయకుండా ఆవిరి సినిమాను త్వరగా  తీసేయ్యడం మంచిది బ్రదర్ అని అంటున్నారు నెటీజన్స్. ఎందుకంటే ఎక్సపెక్టేషన్లు ఆవిరి అయిపోయిన తరువాత జనాలకు అవతార్ రేంజ్ సినిమా తప్పించి.. మామూలు సినిమా ఎక్కదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English