మళ్ళీ రిస్క్ చేస్తున్నారా?

మళ్ళీ రిస్క్ చేస్తున్నారా?

గరుడవేగ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయినట్లు రాజశేఖర్ ఓ క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు గాని ఆ సినిమా ద్వారా ఆయన లాభాలను మాత్రం అందుకోలేదు. గరుడవేగలో సగం వరకు సొంత డబ్బులే ఇన్వెస్ట్ చేశారు. కానీ సినిమా నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటో అర్ధం కానీ వేళ మరోసారి గట్టిగానే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. కల్కి సినిమా రాజశేఖర్ గ్యాంగ్ స్ట్రాంగ్ గా రెడీ అవుతోంది.

అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కల్కి పై రాజశేఖర్ టీమ్ చాలా నమ్మకంతో ఉంది. 1983 కాలంలో తెలంగాణ లో కొనసాగే ఈ కథ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. అయితే గరుడవేగ సమయంలో కూడా రాజశేఖర్ గ్యాంగ్ ఇదే నమ్మకంతో డబ్బులు బాగా ఖర్చు చేసింది. ఇప్పుడు వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంటే సెట్స్ కి చాలా ఖర్చవుతుంది. వేరే నిర్మాతల సపోర్ట్ ఉన్నప్పటికీ గరుడవేగ స్ర్టోక్ అనంతరం.. ఉన్న డబ్బు కూడా ఖర్చు చేస్తే సిచువేషన్ ఏంటి?

ఎంత ప్లానింగ్ తో వెళ్లినా కూడా సినిమా క్లిక్ అవ్వకపోతే చాలా రిస్క్ అని చెప్పాలి. అసలే అ! సినిమాతో రెగ్యులర్ ఆడియెన్స్ కి కిక్ తేలేకపోయిన ప్రశాంత్ వర్మ మరోసారి కేవలం యూఎస్ - A క్లాస్ ఆడియెన్స్ కి అర్థమయ్యేలా సినిమా చేస్తే లాభాలు రావడం చాలా కష్టం. మరి కల్కి తో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English