మంచి కథ.. కానీ బడ్జెట్ కష్టాలు

మంచి కథ.. కానీ బడ్జెట్ కష్టాలు

తెలుగులో చాలా వేగంగా సినిమాలు చేసిన కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు. కొన్నేళ్లుగా సంవత్సరానికి మూణ్నాలుగు రిలీజ్‌లు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు రోహిత్. కానీ రాశి ఎక్కువై.. వాసి తగ్గిపోవడంతో అతడి జోరు తగ్గిపోయింది. మునుపటిలో అతడిలో కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఇంతకుముందులా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయట్లేదతను. పోయినేడాది ‘శమంతకమణి’.. ఈ ఏడాది ‘వీర భోగ వసంత రాయలు’.. అతడికి తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఆ దెబ్బతో మల్టీస్టారర్ మూవీస్ కూడా ఆపేశాడు. ఇప్పుడు సోలో హీరోగా ఒక సినిమాపై అతను దృష్టిసారించాడు. ఆ చిత్రమే ‘అనగనగా దక్షిణాది’లో. ఈ మధ్య తెలుగులో పీరియడ్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇది కూడా ఆ కోవలోని సినిమానే. 70వ దశకం నేపథ్యంలో నడిచే చిత్రమిది.

రోహిత్ తొలి సినిమా ‘బాణం’ తీసిన చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర వర్గాల సమాచారం ఇది చాలా మంచి కథతో తెరకెక్కుతున్న సినిమా అట. రాజీ లేకుండా ఈ కథను తెరకెక్కిస్తే ఓ రేంజ్ మూవీ అవుతుందంటున్నారు. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో నడిచే సినిమా ఇది. ఐతే ఇలాంటి సినిమాలకు కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుతుంది. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమా తీయడం అంత సులువు కాదు. మంచి స్క్రిప్టు తయారైనప్పటికీ ఈ చిత్రానికి బడ్జెట్ అనేది సమస్యగా మారిందట. ఈ చిత్రంలో రోహిత్ కూడా నిర్మాణ భాగస్వామే. అయితే గత కొన్నేళ్లలో రోహిత్ సినిమాలన్నీ తేలిపోవడంతో అతడి మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసింది. ఇప్పుడు అతడి మీద ఐదు కోట్ల బడ్జెట్ అన్నా కూడా కష్టమే. అలాంటిది ఈ చిత్రానికి కనీసం పది కోట్లయినా పెట్టాల్సి ఉంటుందట. దీంతో చిత్ర బృందంలో అయోమయ పరిస్థితి నెలకొందట. మరి రోహిత్ ఏదైతే అది అయ్యిందని రాజీ లేకుండా ఈ సినిమాపై ఖర్చు పెడతాడా.. లేక బడ్జెట్ రికవరీ కష్టమని ఔట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English